Dance Video: అదరగొట్టావ్ బాసూ.. నీ ట్యాలెంట్‌కి హ్యాట్సాఫ్..! మాటలు రావట్లేదంటున్న నెటిజనం.. ట్రెండ్ అవుతున్న వీడియో..
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. నిజానికి ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత ప్రతిఒక్కరూ తమలో దాగిఉన్న ట్యాలెంట్‌కు పదును పెడుతున్నారు. వారిలోని
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. నిజానికి ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన తర్వాత ప్రతిఒక్కరూ తమలో దాగిఉన్న ట్యాలెంట్‌కు పదును పెడుతున్నారు. వారిలోని ప్రతిభను నెట్టింట చాటుతున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. టాలెంట్ విషయానికి వస్తే, మన దేశంలో దానికి కొరత లేదని మనందరికీ తెలుసు. ఇలాంటి వారిలో జైదీప్ గోహిల్ పేరు కూడా ఉంటుంది. అతనికి భారతదేశపు మొదటి నీటి అడుగున డాన్స్ చేసే వ్యక్తిగా పేరుంది. అతని వీడియో ఇంటర్నెట్‌లో వచ్చినప్పుడల్లా విపరీతంగా వైరల్ అవుతుంది. తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో నీటి అడుగున మైఖేల్ జాక్సన్ పాపులర్ సాంగ్ క్రిమినల్‌కు జైదీప్ డ్యాన్స్ చేసాడు. జైదీప్ నీటిలో ఉంచిన పూల్ టేబుల్‌పై ఈ ప్రదర్శన చేశాడు. మూన్‌వాక్ సమయంలో అతను చాలాసార్లు తలక్రిందులుగా తిరిగాడు. ఈ మొత్తం వీడియోలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఈ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో అతని డ్యాన్స్ వీడియోలను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోలపై నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తుంటారు. ‘ఇది అత్యంత కిల్లర్ మూన్‌వాక్’ అని ఒకరు కామెంట్ చేయగా, ‘ఈ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాటలు రావడంలేదు బ్రో’ అంటూ మరొకరు కామెంట్లు పంచుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!
స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు
పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!
మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే..
లేడీ ఏసీపీ సాహసం... కదులుతున్న బస్సుకు ఎదురుగా నిలబడి
ఆహా స్కెచ్ అంటే నీదే బాస్.. అప్పు తీర్చడానికి ఏం ప్లాన్ చేసాడు

