Shark fish attack: ఒడ్డుపై తల్లీ కుమారులు.. షార్క్‌కు ఆహారం పెట్టబోయి.. నీటిలో వేగంగా దూసుకువస్తున్న షార్క్..

Updated on: Aug 23, 2022 | 8:28 AM

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర జీవుల్లో షార్క్స్ ఒకటి. అందుకే సముద్రంలో ప్రయాణం చేసే వారు, చేపలు పట్టేవారు వీటి పట్ల ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటారు. ఎందుకంటే అవి ఎప్పుడు ఏ వైపు


ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర జీవుల్లో షార్క్స్ ఒకటి. అందుకే సముద్రంలో ప్రయాణం చేసే వారు, చేపలు పట్టేవారు వీటి పట్ల ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటారు. ఎందుకంటే అవి ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తాయో ఎవ్వరికీ తెలియదు. తాజాగా అలాంటి ప్రమాదకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ తన కుమారుడితో కలిసి షార్క్ కు మాంసం ముక్క తినిపించే ప్రయత్నం చేసింది. షార్క్ మాంసాహార జీవి కాబట్టి, మాంసం ముక్కను చూసిన వెంటనే అది వారి వద్దకు వచ్చింది. షార్క్ వారి దగ్గరికి వచ్చిన సమయంలో తల్లీ బిడ్డలు ఇద్దరూ బ్యాలెన్స్ కోల్పోయి నీటిలో ఉన్న షార్క్ పై పడిపోయారు. అయితే షార్క్‌ వారినేమీ చేయలేదు.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. దాంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ట్విట్టర్‌లో పోస్టయిన ఈ వీడియో తెగ అవుతోంది. వేలాది మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షిస్తూ వందలాది మంది లైక్ చేశారు. తమదైన శైలిలో కామెంట్లు చేశారు. చిన్న షార్క్ ప్లేస్ లో పెద్ద షార్క్ ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని, పిల్లలతో ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదకర సాహసాలు చేయవద్దని కామెంట్ల రూపంలో నెటిజన్లు సూచిస్తున్నారు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..