Tiger: రోడ్డు దాటుతున్న పులిని ఢీకొట్టిన వాహనం.. పాపం కాళ్లు ఈడ్చుకుంటూ.. వీడియో వైరల్.
వాహనదారులు అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల అభయారణ్యాల గుండా వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. అటవీ మార్గంలోని రహదారుల గుండా వెళ్లే జంతువులు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలని చెబుతుంటారు. కానీ, మితిమీరిన వేగంతో వెళ్తూ కొందరు
వాహనదారులు అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల అభయారణ్యాల గుండా వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలని ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. అటవీ మార్గంలోని రహదారుల గుండా వెళ్లే జంతువులు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలని చెబుతుంటారు. కానీ, మితిమీరిన వేగంతో వెళ్తూ కొందరు వాహనదారులు మూగజీవాలను ప్రమాదాల్లో పడేస్తుంటారు. తాజాగా రోడ్డు దాటుతున్న పులిని ఓ వాహనం ఢీకొట్టింది. పాపం ఆ పులి కాళ్లకు తీవ్ర గాయం కావడంత ఓనడవలేని స్థితిలో కాళ్లు ఈడ్చుకుంటూ అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన మహారాష్ట్ర లోని గోండియా జిల్లా నవేగావ్ – నాగ్జీరా కారిడార్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగినట్టు తెలిసింది. పులి గాయపడటం అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు చూసారు. దాంతో వాహనాలను ఎక్కడికక్కడ ఆపేశారు. పాపం పులి రెండు సార్లు లేచి వెళ్లటానికి ప్రయత్నించింది. కానీ లేవలేకపోయింది. దాంతో కాళ్లు ఈడ్చుకుంటూ చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. గాయపడిన పులిని వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్‌కు తరలిస్తుండగా మరణించినట్టుగా అధికారులు వెల్లడించారు. ఈ ఘటన మొత్తాన్ని తమ మొబైల్స్‌లో రికార్డు చేసిన కొందరు వాహనదారులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పులి దీనస్థితిని చూసి జంతు ప్రేమికులు చలించిపోయారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్‌లో వాహనాలను ఎందుకు అనుమతిస్తారంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...