Viral Video: నాలుగు కార్లను ఢీకొన్న ట్రక్కు.. ఆపై ఆగివున్న లారీని సైతం.. వీడియో

|

Aug 15, 2023 | 1:15 PM

రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనో, మరో కారణంచేతనో ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా జరుగుతుంటుంది. తాజాగా ఓ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతూ నెటిజన్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఇందులో రద్దీగా ఉండే రహదారిపై వేగంగా వచ్చిన ట్రక్కు నాలుగు వాహనాలను ఒక్కసారిగా ఢీకొట్టింది.

రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనో, మరో కారణంచేతనో ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా జరుగుతుంటుంది. తాజాగా ఓ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతూ నెటిజన్లను ఆందోళనకు గురి చేస్తోంది. ఇందులో రద్దీగా ఉండే రహదారిపై వేగంగా వచ్చిన ట్రక్కు నాలుగు వాహనాలను ఒక్కసారిగా ఢీకొట్టింది. నాలుగు కార్లూ నుజ్జు నుజ్జు అయిపోయాయి. ఈ దృశ్యాలు మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. అంతలోనే వెనుక నుంచి అదుపుతప్పి వేగంగా దూసుకు వస్తున్న ట్రక్కు ఎదురుగా ఉన్న నాలుగు వాహనాలను బలంగా ఢీకొట్టింది. దాంతో వాహనాలన్నీ బొమ్మల్లా ముక్కలైపోయాయి. అనంతరం ఎదురుగా వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనను చూసిన జనం షాక్‌తో వణికిపోయారు. ఈ భయానక వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌ అవుతున్నారు. భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...