Gold Treasure: ఇంటికోసం పునాదులు తవ్వుతున్న కూలీలు.. తవ్వకాల్లో బయటపడ్డ బంగారు నిధి.. విలువ ఎంతో తెలుసా..
మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్విస్తున్నాడు. ఈ క్రమంలో కూలీలు పునాదులు తవ్వుతుండగా ఆ భూమిలో బంగారు నిధి దొరికింది. అందులో భారీగా బంగారం,
మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్విస్తున్నాడు. ఈ క్రమంలో కూలీలు పునాదులు తవ్వుతుండగా ఆ భూమిలో బంగారు నిధి దొరికింది. అందులో భారీగా బంగారం, పురాతన నాణాలు ఉండటంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు. దొరికిన బంగారం, నాణేలను గుట్టు చప్పుడు కాకుండా కూలీలందరూ కలిసి సమానంగా పంచుకున్నారు. కానీ, నిధి విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు తెలిసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆగస్టు 26 సాయంత్రం నాటికి నిధిలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల సమాచారం ప్రకారం, నల్చా దర్వాజా సమీపంలోని చిట్నీస్ చౌక్‌లో శివనారాయణ రాథోడ్ ఇల్లు రెండు భాగాలుగా నిర్మించబడింది.కుటుంబం ఒక భాగంలో నివసిస్తుంది. మరొక భాగం శిథిలావస్థలో ఉంది. నెల రోజులుగా ఈ భాగాన్ని పునర్నిర్మాణం కోసం కూల్చివేస్తున్నారు. సైట్‌లో పనిచేస్తున్న కూలీలు ఒక గోడలో పాత బంగారు నాణేలు,బంగారు ఆభరణాలను కనుగొన్నారు. వాటి గురించి ఎవరికీ తెలియకుండా తమలో తాము పంచుకున్నారు. అయితే కొన్ని పాత ఆభరణాలను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించి యాక్టివ్ అయ్యారు. ఇంటి పునర్నిర్మాణంలో పనిచేస్తున్న ఎనిమిది మంది కూలీలను అరెస్టు చేసిన పోలీసులు బంగారం, ఇతర ఖరీదైన లోహంతోపాటు కోటి రూపాయల విలువైన వస్తువులను ధార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సమీర్ పాటిదార్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Shocking Video: మూడుసార్లు కాటేసినా.., తగ్గలే అంటూ పామును ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి..
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

