Tiger Video: చనువు ఇచ్చిందిగా అని పులితో సెల్ఫీ దిగాలని చూస్తే..! ఆ తర్వాత ఏమైందంటే..!వీడియో..

Updated on: Oct 18, 2022 | 9:38 AM

అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న పులిని ఫొటోలు తీసేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వీడియోలో నలుగురు వ్యక్తులు అటవీ ప్రాంతంలో రహదారిపై వెళ్తుండగా.. అదే సమయంలో అడవిలో నుంచి రోడ్డుకు దగ్గరగా వస్తున్న ఓ పెద్ద పులి వారికి తారస పడింది. అది చూసిన యువకులు వీడియోలు, ఫొటోలు తీస్తూ పులికి దగ్గరగా వెళ్లారు. అంతటితో ఆగకుండా ఓ యువకుడు ఏకంగా పులితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు పులి సదరు యువకులను పట్టించుకోకుండా వెళ్లిపోయింది.ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్‌లో పోస్టు చేశాడు. దయచేసి ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకండి అంటూ… యువకుల తీరును తప్పుబట్టారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలను మాత్రం సుశాంత్‌ నంద వెల్లడించలేదు. వీడియో చూసిన నెటిజన్లు యువకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘‘ అరె బాబూ.. పులితో ఆటలా.. జాగ్రత్త’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 18, 2022 09:38 AM