Viral: క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.

|

Dec 15, 2024 | 5:46 PM

క్లాస్‌రూమ్‌లో బెంచ్ ల మధ్య ఒకాయన హాయిగా నిద్రపోతున్నారు. బెంచ్ ల మధ్య పడుకున్న ఆయన ఏకంగా పుస్తకాల కట్టను తలగడగా పెట్టుకున్నారు. పక్కనే మంచి నీళ్ల బాటిల్ కూడా ఉంది. ఇది ఒక స్కూల్లోని తరగతి గది అని అర్ధమవుతోంది. అయితే నిద్రపోతున్నది ఎవరనేగా మీ అనుమానం. అవునండీ మీరనుకుంటున్నట్లుగా ముమ్మాటికీ ఈయన స్కూల్‌ మాష్టారే.

పేరు కేవీ నారాయణ. గుంటూరు జిల్లా పాతమల్లాయపాలెంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం 1.40 నిమిషాలకు మాస్టారు ఏకంగా నిద్రకు ఉపక్రమించేశారు. అయితే విద్యార్ధులు ఏమయ్యారనేగా మీ డౌట్. నారాయణ మాష్టారు వారందరిని పక్కనే ఉన్న అంగన్ వాడీ సెంటర్ కు పంపించారు. ఆ తర్వాతే హాయిగా నిద్రపోయారు. ఇంతవరకూ భాగానే ఉంది. అయితే ఆయన నిద్రపోతున్న ఫోటోలు ఏకంగా గుంటూరు డిఈవోకు వాట్సప్ లో వచ్చాయి. వెంటనే ఆమె ఎంఈవోలను విచారణకు ఆదేశించారు. ఎంఈవోలు రమాదేవి, లీలా రాణి విచారణకు వెళ్లారు. అందరి స్టేట్ మెంట్స్ రికార్డు చేసి నివేదికను డీఈవోకు పంపారు.

అయితే ఇది ఏకోపాధ్యాయ పాఠశాల అని ఇందులో పదమూడు మంది విద్యార్దులున్నారని ఎంఈవోలు చెప్పారు. తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతోనే విద్యార్ధులను అంగన్ వాడీ సెంటర్ కు పంపించి తాను నిద్రపోయినట్లు నారాయణ మాష్టారు వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆరోగ్యం సరిగా లేకుంటే ముందే సమాచారం ఇచ్చి ఉంటే వేరొక మాష్టారును పంపించేవారమని ఎంఈవోలు చెప్పారు. దీంతో తాను ఎందుకు నిద్ర పోయింది అన్న అంశంపై సరిగ్గా వివరణ ఇచ్చుకోలేకపోయారు. ఎంఈవోల నివేదిక అందిన వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు డీఈవో రేణుక సిద్దమయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.