Strange Calf: గేదె కడుపున అచ్చం మనిషి ముఖంతో వింత దూడ జననం.. వీడియో వైరల్.
అనకాపల్లి జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ గేదెకు వింత దూడ జన్మించింది. అచ్చం మనిషి ముఖాన్ని పోలినట్లుగా ఉన్న ఆ దూడ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వింత దూడను చూసేందుకు స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాలవారూ పోటెత్తారు. గొలుగొండ మండలం ఏ ఎల్ పురం గ్రామంలో వబ్బల రెడ్డి పోతురాజు అనే రైతు ఇంట ఈ వింత దూడ జన్మించింది.
అనకాపల్లి జిల్లాలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ గేదెకు వింత దూడ జన్మించింది. అచ్చం మనిషి ముఖాన్ని పోలినట్లుగా ఉన్న ఆ దూడ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వింత దూడను చూసేందుకు స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాలవారూ పోటెత్తారు. గొలుగొండ మండలం ఏ ఎల్ పురం గ్రామంలో వబ్బల రెడ్డి పోతురాజు అనే రైతు ఇంట ఈ వింత దూడ జన్మించింది. గేదెకి సమయం మించినప్పటికీ ప్రసవించలేక తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే రైతు వెటర్నరీ డాక్టర్ శిరీషకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న డాక్టర్ శిరీష గేదెకు ఆపరేషన్ చేసి మృతి చెందిన దూడను బయటకు తీశారు. ఆ దూడ తల మనిషిని పోలి ఉండడంతో అంతా అవాక్కయ్యారు. తల్లి గేదె క్షేమంగా ఉంది. జన్యుపరమైన లోపాల వల్లే ఇలాంటి దూడలు జన్మిస్తాయని వైద్యులు అంటున్నారు. ఈ వింత దూడను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఆ దూడ తల మనిషిని పోలి ఉండటంతో అంతా ఆశ్చర్యపోయారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతుందని అంతా చర్చించుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

