Viral: 30 ఏళ్లు హౌస్‌కీపర్‌గా పనిచేసింది.. చివరికి సప్రైజ్ వెల్కమ్ చెప్పిన కొడుకు.

Viral: 30 ఏళ్లు హౌస్‌కీపర్‌గా పనిచేసింది.. చివరికి సప్రైజ్ వెల్కమ్ చెప్పిన కొడుకు.

Anil kumar poka

|

Updated on: Oct 25, 2023 | 9:41 AM

తల్లిదండ్రులు తమ పిల్లల కలలు నెరవేరేందుకు ఎంతో కష్టపడతారు. కొడుకుని పైలట్ గా చూసుకుని ఓ తల్లి సంబరపడిపోయింది. 30 ఏళ్ల తన కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు అతడిని కౌగిలించుకుని కన్నీరు పెట్టుకుంది.తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువు చెప్పించడానికి వారిని మంచి స్ధాయిలో నిలబెట్టేందుకు చాలా కష్టపడతారు. అలాగే ఓ మహిళ పైలట్ కావాలనుకున్న కొడుకు కోరిక తీర్చడం కోసం 30 ఏళ్లు హౌస్ కీపర్‌గా పనిచేసింది.

తల్లిదండ్రులు తమ పిల్లల కలలు నెరవేరేందుకు ఎంతో కష్టపడతారు. కొడుకుని పైలట్ గా చూసుకుని ఓ తల్లి సంబరపడిపోయింది. 30 ఏళ్ల తన కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు అతడిని కౌగిలించుకుని కన్నీరు పెట్టుకుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువు చెప్పించడానికి వారిని మంచి స్ధాయిలో నిలబెట్టేందుకు చాలా కష్టపడతారు. అలాగే ఓ మహిళ పైలట్ కావాలనుకున్న కొడుకు కోరిక తీర్చడం కోసం 30 ఏళ్లు హౌస్ కీపర్‌గా పనిచేసింది. చివరికి ఆమె కష్టానికి ప్రతిఫలం లభించింది. విమానం ఎక్కిన ఆమె పైలట్‌గా కనిపించిన కొడుకుని చూసి స్పందించిన తీరు అందరి మనసుల్ని కదిలించింది. రెడ్డిట్‌‌లో షేర్ చేసిన వీడియో క్లిప్‌లో మహిళ ఫ్లైట్‌లోకి రావడం.. సిబ్బంది ఆమెను విష్‌ చేయడం కనిపిస్తుంది. కొన్ని సెకన్లలో ఎయిర్ హోస్టెస్ కర్టెన్లను తీయగానే ఆమె కొడుకు పూల బొకేతో నిలబడి ఉండటం చూస్తుంది. పైలట్ యూనిఫాంలో ఉన్న కొడుకుని చూసి ఆశ్చర్యపోతుంది. వెంటనే ఎమోషనలై కొడుకుని హత్తుకుని సంబరపడుతుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆమె కష్టానికి, త్యాగానికి ప్రతిఫలంగా ఆమె కొడుకు తన కల నెరవేర్చడం .. ఎంత అద్భుతమైన వీడియో అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..