Parrot Viral Video: కొంటె చిలుక… టూరిస్ట్‌ కెమెరా ఎత్తుకెళ్లి ఏం చేసిందో తెలుసా..? వైరల్ అవుతున్న వీడియో..

|

Mar 13, 2022 | 9:41 AM

ఓ కొంటె చిలుక టూరిస్ట్‌ గోప్రో కెమెరాను ఎత్తుకెళ్లిపోయింది. అంతేకాదు.. అలా దొంగిలించిన కెమెరాతో నేషనల్ పార్క్ మొత్తం అందాలను వీడియో షూట్ చేసింది. న్యూజిలాండ్‌లోని ఫియోర్డ్‌ల్యాండ్ నేషనల్ పార్క్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఓ కొంటె చిలుక టూరిస్ట్‌ గోప్రో కెమెరాను ఎత్తుకెళ్లిపోయింది. అంతేకాదు.. అలా దొంగిలించిన కెమెరాతో నేషనల్ పార్క్ మొత్తం అందాలను వీడియో షూట్ చేసింది. న్యూజిలాండ్‌లోని ఫియోర్డ్‌ల్యాండ్ నేషనల్ పార్క్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ కుటుంబం న్యూజిలాండ్‌లోని ఫియోర్డ్‌‌ల్యాండ్ నేషనల్ పార్క్‌ పక్షులు, జంతువులను చూసేందుకు విహారయాత్రకు వెళ్లింది. తమ వెంట గోప్రో కెమెరాను కూడా తీసుకెళ్లారు. పక్షులను షూట్ చేస్తూ.. కెమెరాను ఒక గోడపై పెట్టారు. ఇంతలో పక్కనే ఉన్న ఓ చిలుక అకస్మాత్తుగా కెమెరా వైపు తిరిగింది. చకచకా నడుచుకుంటూ వచ్చి.. ఆ గోప్రో కెమెరాను నోటితో పట్టుకుని ఎగిరిపోయింది. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణించిన చిలుక.. ఓ చెట్టు మీద కూర్చింది. కెమెరాను తినే పదార్థం అనుకుందో ఏమో గానీ.. దానిని ముక్కుతో పొడుస్తూ తినేందుకు ప్రయత్నించింది. అయితే, చిలుక కెమెరాను ఎత్తుకెళ్తున్న సమయంలో కెమెరా ఆన్‌లో ఉండటంతో.. నేషన్ పార్క్ అందాలన్నీ రికార్డ్ అయ్యాయి. చిలుక ఎగిరినంత సేపు.. కెమెరాలో విజువల్స్ రికార్డ్ అయ్యాయి.ఆ కాసేపటికే గోప్రో కెమెరాను ఎత్తుకెళ్లిన చిలుకను వెతుక్కుంటూ సదరు టూరిస్టు ఫ్యామిలీ వెళ్లింది. ఓ చెట్టుపై కెమెరాతో ఉన్న చిలుకను గమనించారు. వెంటనే దాని వద్దకు వెళ్లి కెమెరాను తీసుకునేందుకు ప్రయత్నించారు…. దాంతో ఆ చిలుక కెమెరాను వదిలి తుర్రుమని ఎగిరిపోయింది. కాగా, కెమెరాలో అందమైన దృశ్యాలు రికార్డవ్వడంతో.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్ల మది దోచుకుంటోంది. అందమైన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ బ్యూటీఫుల్ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Prabhas-Radhe Shyam: ‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ ఫ్యాన్స్.. ‘రాధేశ్యామ్’ నుంచి డార్లింగ్ హై క్వాలిటీ ఫొటోస్ మీ కోసం..

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Ashika Ranganath: కన్నడ ఇండస్ట్రీను షేక్ చేసి టాలీవుడ్ ఎంట్రీకు సిద్హమవుతున్న ‘అషికా రంగనాధ్’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్‌ స్టిల్స్‌.. అప్పుడే యాక్టింగ్‌ మొదలెట్టిందా..!

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్