Pets at Home: ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..

Updated on: May 19, 2024 | 5:31 PM

ముఖ్యంగా కుక్కల్ని పెంచుకునేవాళ్లు..! పెంపుడు కుక్కలు పక్కింటివాళ్లతో ఎలాంటి గొడవలు తెచ్చాయో గతంలోనూ చాలా చూసాం. కానీ ఇప్పుడు జరిగిన గొడవ, ఆ దాడి దృశ్యాలు షాకింగ్‌గా ఉన్నాయ్‌. పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం చివరికి దాడులు చేసుకొనే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో ఓ కుటుంబానికి చెందిన వారు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.

ముఖ్యంగా కుక్కల్ని పెంచుకునేవాళ్లు..! పెంపుడు కుక్కలు పక్కింటివాళ్లతో ఎలాంటి గొడవలు తెచ్చాయో గతంలోనూ చాలా చూసాం. కానీ ఇప్పుడు జరిగిన గొడవ, ఆ దాడి దృశ్యాలు షాకింగ్‌గా ఉన్నాయ్‌. పెంపుడు కుక్క విషయంలో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం చివరికి దాడులు చేసుకొనే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో ఓ కుటుంబానికి చెందిన వారు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. వాళ్ల కుక్కకు కూడా బలంగా దెబ్బలు తగలడంతో వెటర్నరీ హాస్పిటల్‌లో చికిత్సకు తరలించారు. హైదరాబాద్‌ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్‌లో జరిగిందీ ఘటన.

రహ్మత్‌నగర్‌కు చెందిన మధు, శ్రీనాథ్‌ల కుటుంబం హస్కీ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు. మార్చి 8న వాళ్ల కుక్క ఎదురింటి ఆవరణలోకి వెళ్లింది. కావాలనే కుక్కను తనపైకి ఉసికొల్పారంటూ ధనుంజయ్‌ వారితో గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్‌ చేసుకున్నారు. తాను కంప్లైంట్‌ చేసినా పోలీసులు ఎలాంటి యాక్షన్‌ తీసుకోలేదని రగిలిపోయిన ధనుంజయ్‌… దాడి చేసేందుకు టైమ్‌ కోసం ఎదురు చూశాడు. మంగళవారం మధు సోదరుడు శ్రీనాథ్ కుక్కను తీసుకుని వాకింగ్‌కు బయటకు వెళ్లాడు. అదే అదనుగా ధనుంజయ్‌ తనతోపాటు నలుగురిని వెంట పెట్టుకుని వచ్చి ఇనుప రాడ్లతో కుక్కను విచక్షణారహితంగా కొట్టారు. దానిని అడ్డుకున్న శ్రీనాథ్‌ కుటుంబ సభ్యులపైనా దాడి చేసారు. ఈ దాడిలో శ్రీనాథ్ తో పాటు అతడి తల్లి రాజేశ్వరి, అతడి మరదలు స్వప్న కు తీవ్ర గాయాలయ్యాయి. కుక్కతో పాటు కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.