Monkey Trending Video: స్టైల్ విషయంలో తగ్గేదేలే..! ఒక్క హెయిర్‌కట్‌తో మోడల్‌గా మారిన మంకీ..
అందంగా హెయిర్ స్టెయిల్ చేసుకుని నలుగురిలో మోడల్‌లా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందుకోసం నెలకోసారి హెయిర్ కటింగ్స్, హెయిర్ కలర్స్.. ఇలా ఏవేవో చేస్తుంటాం కదా..
అందంగా హెయిర్ స్టెయిల్ చేసుకుని నలుగురిలో మోడల్‌లా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందుకోసం నెలకోసారి హెయిర్ కటింగ్స్, హెయిర్ కలర్స్.. ఇలా ఏవేవో చేస్తుంటాం కదా.. దానికి తోడు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ‘మోడల్ మోడల్’ అనే సాంగ్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ పాట పెట్టుకుని ఎంతో మంది మోడల్ అని చెప్పకుంటూ తమ హెయిర్ స్టెయిల్‌కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి హెయిర్ స్టెయిల్‌కి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కానీ అందులో ఉన్నది మనిషి కాదండోయ్.. కోతి. అవును, బార్బర్ షాప్‌కి వెళ్లి స్పైకీ హెయిర్ కటింగ్ చేయించుకుంది ఈ మంకీ. అంతేనా.. దీనికి సంబంధించిన వీడియోను కూడా నెట్టింట పోస్ట్ చేయించుకుంది. అంతే.. ఆ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మోడల్ మోడల్ పాట వస్తుంటే.. ఆ కోతి వీడియోకు ఫోజులిస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ‘మంకీ మోడల్’ అని ఒకరంటే, ‘వీడు కదా అసలైన మంకీ కింగ్’ అంటూ మరొకరు కామెంట్స్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 19 లక్షలమందికి పైగా వీక్షించగా, 40 వేల మంది లైక్ చేశారు. అనేక మంది వీడియోను షేర్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..