Monkey Viral video: షాపులోనుంచి మాయమవుతున్న సీసీ కెమెరాలు.. సీసీ పుటేజ్ చూసి యజమాని షాక్..
అల్లరి పనులకు కేరాఫ్ అడ్రస్ కోతులు. అందుకే తరచూ మనం కోతి చేష్టలు చేయకు అంటూంటాం. తాజాగా ఓ కోతి దొంగతనాలు చేస్తూ ఒ షాపు యజమానికి చుక్కలు చూపించింది. ఇంతకీ ఆ కోతి ఏమి దొంగిలించిందో తెలిస్తే షాకవుతారు.
కన్యాకుమారిలోని ఓ ప్లైవుడ్ కంపెనీ యజమాని తన షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎవరో దొంగిలిస్తున్నారు. ఎన్నిసార్లు పెట్టినా మళ్లీ మళ్లీ అవి చోరీ చేస్తూనే ఉన్నారు. ప్లైవుడ్ షాపు పరిసరాల్లో ఏం జరుగుతుందో గుర్తించేందుకు యజమాని తన షాపులో సీసీటీవీ కెమెరాలను అమర్చాడు. చోరీలను పసిగట్టేందుకు తాను ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఒకదాని తర్వాత ఒకటి చోరీకి గురిఅవుతుండటంతో యజమాని విస్తుపోయాడు. కెమెరాలను చోరీ చేస్తున్న దొంగను పట్టుకునేందుకు యజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ క్రమంలో తన షాపు నుంచి సీసీటీవీ కెమెరాలను దొంగిలిస్తోంది ఓ కోతి అని తెలిసి షాక్ తిన్నాడు. షాపులో మరోచోట ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ విషయం బయటపడింది. యజమాని ఇప్పటివరకూ 13 సీసీటీవీ కెమెరాలను కోల్పోగా సీసీటీవీ కెమెరాలను చోరీ చేసిన కోతి వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

