Monkey viral video: కలెక్టర్ కళ్లజోడు ఎత్తుకెళ్లిన కోతి.. రెండు ఫ్రూటీలకు పక్కన పడేసింది.. వైరల్ అవుతున్న వీడియో..
ఒక జిల్లా కలెక్టర్ కళ్లజోడును కోతి ఎత్తుకుపోయింది. ఆయన ఎంత బతిమాలినా దానిని తిరిగి ఇవ్వలేదు. చివరకు ఫ్రూటీ ఇవ్వడంతో ఆ కళ్లజోడును పక్కన పడేసింది.
ఒక జిల్లా కలెక్టర్ కళ్లజోడును కోతి ఎత్తుకుపోయింది. ఆయన ఎంత బతిమాలినా దానిని తిరిగి ఇవ్వలేదు. చివరకు ఫ్రూటీ ఇవ్వడంతో ఆ కళ్లజోడును పక్కన పడేసింది. ఉత్తరప్రదేశ్ మథుర జిల్లా బృందావన్‌లోని బాంకే బిహారీ మందిర్‌కు వెళ్లే వీధిలో అధికారులు, ఇతర సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ నవనీత్ చాహల్ నడిచి వెళ్తున్నారు. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్తున్న ఆయన భుజంపై ఒక కోతి కూర్చుంది. ఆ వెంటనే కలెక్టర్ నవనీత్ కళ్లద్దాలను ఎత్తుకెళ్లింది. అక్కడున్న ఇంటి ఇనుప మెట్లపై అది కూర్చొంది. కాగా, కలెక్టర్‌తోపాటు ఇతర సిబ్బంది, పోలీసులు కోతి నుంచి కళ్ల జోడును తిరిగి పొందేందుకు తెగ ప్రయత్నించారు. నవనీత్ చాహల్ ఎంత మొర పెట్టుకున్నా ఆయన కళ్లద్దాలను ఆ కోతి తిరిగి ఇవ్వలేదు. చివరకు పోలీసులు రెండు ఫ్రూటీలను కోతి వద్దకు విసిరారు. దీంతో అది కళ్లజోడును పక్కన పడేసి ఫ్రూటీ ప్యాకెట్ తీసుకుంది. పోలీసులు ఆ కళ్లజోడును తెచ్చి కలెక్టర్‌కు ఇచ్చారు. మరోవైపు అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

