Viral video: రైలులో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటినొప్పులు.. కదులుతున్న రైలులోనే కాన్పు చేసిన వైద్య విద్యార్థిని స్వాతి

|

Sep 20, 2022 | 9:34 AM

సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేస్తున్న గర్భిణికి పురిటినొప్పులు మొదలయ్యాయి. భర్త కంగారు పడ్డాడు. రైలు ఫాస్ట్‌గా పరుగులు పెడుతోంది. అది కూడా రాత్రి పూట..!


సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేస్తున్న గర్భిణికి పురిటినొప్పులు మొదలయ్యాయి. భర్త కంగారు పడ్డాడు. రైలు ఫాస్ట్‌గా పరుగులు పెడుతోంది. అది కూడా రాత్రి పూట..! భార్య పరిస్థితి చూసి ఆందోళనకు గురైన భర్త చేసేది లేక తోటి ప్రయానికులను లేపడం మొదలు పెట్టాడు. ఇంతలో అదే రైల్లో ప్రయాణస్తున్న స్వాతి అనే వైద్య విద్యార్థిని.. ఆమెకు సపర్యలు చేశారు. దీంతో గర్భిణి రైల్లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రైలు అనకాపల్లి రాగానే రైల్వే అధికారుల సహకారంతో ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించ్చారు. అక్కడ తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో ఆ వైద్య విద్యార్థినిని అంతా అభినందనలతో ముంచెత్తారు. శ్రీకాకుళం జిల్లా సిగడా మండలం బూటుపేట గ్రామానికి చెందిన సత్యవతి, సత్యనారాయణ హైదరాబాద్‌లో ఉంటున్నారు. సత్యవతి పురుడు కోసం అమ్మవారి ఇంటికి వెళ్తుండగా.. రైలు రాజమండ్రి దాటగానే నొప్పులు మొదలయ్యాయి. విశాఖపట్నం గీతం కాలేజీలో గైనిక్ లో పీజీ చేస్తున్న స్వాతి రెడ్డి అనే పీజీ విద్యార్థిని అదే రైలులో ప్రయాణిస్తున్నారు. గర్భిణీ పరిస్థితిని చూసి స్పందించిన ఆమె.. నడుస్తున్న ట్రైన్‌లోనే పురుడు పోశారు. అనంతరం ట్రైన్‌కు దగ్గర్లో ఉన్న అనకాపల్లి స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించడంతో అలర్టయ్యారు. రైలు ఆపి తల్లిబిడ్డలను అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సకాలంలో వైద్య సేవలందించిన వైద్య విద్యార్థినిని అంతా అభినందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 20, 2022 09:34 AM