Heart Touching Video: విధిరాతను ఓడించిన ఎదురీత.. ఒక పక్క కుటుంభం , మరో పక్క అంగవైకల్యం.. హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో..

Heart Touching Video: విధిరాతను ఓడించిన ఎదురీత.. ఒక పక్క కుటుంభం , మరో పక్క అంగవైకల్యం.. హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో..

Anil kumar poka

|

Updated on: Jun 03, 2022 | 9:52 AM

తల్లిదండ్రులు తమ పిల్లలకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో..ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి షేర్ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.


తల్లిదండ్రులు తమ పిల్లలకోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో..ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి షేర్ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. పిల్లల కోసం అంగవైకల్యం కలిగిన ఓ తండ్రి తపన అందరినీ కదిలిస్తోంది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అంగవైకల్యంతో ఉన్న ఓ వ్యక్తి ట్రైసైకిల్‌పై స్కూల్ యూనిఫాంలో ఉన్న ఇద్దరు పిల్లలను కూర్చోబెట్టుకుని వెళ్తున్నాడు. పిల్లలిద్దరూ వెనకాల కూర్చుని ఉండగా, అతడు ట్రైసైకిల్‌ను చేతితో తొక్కుతున్నాడు. ఒక చిన్నారి వెనుక సీటులో కూర్చుంటే, మరోబాలుడు ముందు సీటులో ఉన్నాడు. ఈ దృశ్యాన్ని స్థానికులేవరో వీడియోతీసి సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. దాంతో వీడియో కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదుకానీ, వీడియోను సోనాల్ గోయెల్ అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోను ట్వీట్ చేస్తున్నప్పుడు, అంగవైకల్యం కలిగిన ఆ వ్యక్తి ఆ ఇద్దరు పిల్లలకు తండ్రిగా చెప్పుకొచ్చారు..ఎందుకంటే, తల్లిదండ్రులు మాత్రమే..తమ పిల్లల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారన్నది వాస్తవం.. అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను లక్షలమందికి పైగా వీక్షిస్తున్నారు. రకరకాలుగా స్పందిస్తున్నారు. ఘటన మనసుకు హత్తుకునేదిగా ఉందంటూ కొందరు ట్వీట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Published on: Jun 03, 2022 09:52 AM