Airlines Flight: విమానం గాలిలో ఉండగానే మరో సిగ్గుమాలిన ఘటన..! అందరూ చూస్తుండగానే..
ఇటీవల విమానం గాలిలో ఉండగానే తోటి ప్రయాణికుల పట్ల హద్దులు మీరుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తోటీ ప్రయాణికలపైనే మూత్ర విసర్జన చేయడం లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది.
ఇటీవల విమానం గాలిలో ఉండగానే తోటి ప్రయాణికుల పట్ల హద్దులు మీరుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. తోటీ ప్రయాణికలపైనే మూత్ర విసర్జన చేయడం లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న AA 292 అనే అమెరినకన్ ఏయిర్‌లైన్స్ విమానంలో ఓ వ్యక్తి తప్పతాగి మరో వ్యక్తితో వాగ్వివాదానికి దిగాడు. ఏకంగా అతనిపై మూత్ర విసర్జన చేయడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని ఫ్లైట్ సిబ్బంది అధికారుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ విమానం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషల్ ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు అతగాడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గతంలో విమానంలో ఇలాంటి మూత్ర విసర్జన ఘటనలు చోటు చేసుకున్నాయి. గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న విమానంలో ఓ వ్యక్తి.. 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగుచూడటం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అలాగే గతేడది డిసెంబర్ 6న ప్యారిస్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఏయిర్ ఇండియా విమానంలో ఓ మహిళ సీటు, దుప్పటిలో మరో వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!