కర్ణాటకలోని హుబ్బళ్లి నగరంలోని చెన్నమ్మ సర్కిల్‌లో శుక్రవారం ఒక వింత సంఘటన జరిగింది. సీటు దొరకకపోవడంతో ఒక వృద్ధుడు ప్రైవేట్ బస్సు ముందు పడుకున్నాడు. బస్సు దిగిన డ్రైవర్ ఆ వృద్ధుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా కూడా ఆయన మాట వినకపోవడంతో.. ఇక చేసేందేం లేక.. బస్సులో ముందు సీటు ఆయనకు ఖాళీ చేసి ఇచ్చారు. దాంతో ఆయన వెళ్లి ఆ సీట్లో కూర్చుకున్నాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి