Tea in Flight: విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

|

Dec 27, 2024 | 5:01 PM

ట్రైన్‌ జర్నీలో ఉండే ఎంజాయ్‌ ఇంక దేనిలోనూ ఉండదని చెప్పవచ్చు. దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలంటే ముందుగా గుర్తొచ్చేది రైలు. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు రకరకాల మనుషులు తారసపడతారు. చిరు వ్యాపారులు తినుబండారాలతో ట్రైన్‌లో ప్రత్యక్షమవుతారు. ప్రయాణికులకు అవరాలు తీర్చుతూ వారి జీవనోపాధికి అవసరమైన ధనాన్ని సంపాదించుకుంటారు. ఇందులో ఛాయ్‌ నుంచి అల్పాహారం, స్నాక్స్‌, పండ్లు, నట్స్‌ అన్నీ రైల్లో దొరుకుతాయి.

పట్టాలపై రయ్‌య్‌య్‌..న దూసుకెళ్తున్న రైల్లో ప్రకృతి అందాలను చూస్తూ వేడి వేడి ఛాయ్‌ తాగుతూ సాగే ప్రయాణం ఎంతో బావుంటుంది. మరి ఇలాంటి అనుభూతి ఆకాశంలో కలిగితే… అదేనండి.. విమానంలో.. అవును ఇప్పుడు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఛాయ్‌..ఛాయ్‌..అనే పిలుపు వినిపిస్తే.. ఛాన్సే లేదంటారా.. నిజమే కానీ ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికులను సర్ ప్రైజ్ చేస్తూ అందరికీ చాయ్ తాగించాడు. విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా తన వెంట తీసుకొచ్చిన ఫ్లాస్క్ లోని టీ ని పేపర్ కప్పుల్లో పోసి అందించాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు సరదాగా నవ్వుకుంటూ టీని ఆస్వాదించారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను ఏకంగా 6 కోట్లమందికి పైగా వీక్షించారు. కఠినమైన నిబంధనలతో బోరింగ్ గా అనిపించే విమాన ప్రయాణంలో ఇదొక సరదా అనుభవమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఆ ప్రయాణికుడిని విమర్శిస్తున్నారు. మంచినీళ్లు సహా విమానంలోకి ఎలాంటి ద్రవ పదార్థాలను అనుమతించరని గుర్తుచేస్తూ.. ఈ ప్రయాణికుడు ఫ్లాస్క్ లో టీ తీసుకెళుతుంటే భద్రతా సిబ్బంది ఏం చేశారని మరికొందరు నిలదీస్తున్నారు. ‘ఇంట్లో టీ తయారుచేసుకొని తెచ్చుకున్నారు.. వారి టీ వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో తప్పేముంది?’ అంటూ మరికొంతమంది నెటిజన్లు మద్దతుగా కామెంట్లు పెట్టారు. ‘ఎక్కడైనా, ఎప్పుడైనా సరే ఒక్క మన భారతీయుడు మాత్రమే ఇలా చేయగలడు’ అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.