Crocodile with Man: ఓరి దేవుడా.. మొసలితో విన్యాసాలేంట్రా బాబు..! అంటే లవ్ అంటున్న హీరో..

|

May 28, 2022 | 9:04 PM

ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలని చూస్తే షాకింగ్‌గా అనిపిస్తాయి. తాజాగా ఒక మొసలి, ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో


ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలని చూస్తే షాకింగ్‌గా అనిపిస్తాయి. తాజాగా ఒక మొసలి, ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా షాకవడమే కాదు.. ఛీ.. ఏంటా పాడుపనులు అంటారు… వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి రెండు మొసళ్ల మధ్య రకరకాల విన్యాసాలు చేస్తుంటాడు. ఆ వ్యక్తి మొసలి చేతి వేళ్లను తన చేతిలోకి తీసుకుంటాడు.. దానికి ముద్దులు పెడతాడు.. ఇంకా దాని వీపుపైన పడుకొని విన్యాసాలు చేస్తాడు. అంతేకాదు ఈ వ్యక్తి మొసలిని గట్టిగా కౌగిలించుకున్నాడు కూడా. ఈ వీడియో చూసిన వారంత ఆ వ్యక్తి చేసిన పనికి నోరెళ్ల బెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియోని ఒక నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ వీడియోని వీక్షిస్తున్న వేలమంది లైక్స్‌తో, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఓ నెటిజన్‌ ‘ఈ మొసలి ఆ వ్యక్తిని లవ్‌ చేస్తున్నట్టుంది.. అందుకే అతనిపై దాడి చేయడం లేదంటూ ఫన్నీగా కామెంట్‌ చేసారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Follow us on