Crocodile: భారీ మొసలిని అమాంతం భుజాలపై కెత్తుకొని.. మోసుకెళ్లిన వ్యక్తి..! వీడియో వైరల్..

|

Oct 23, 2023 | 8:47 PM

ఓ వ్యక్తి కాలువలో కనిపించిన పెద్ద మొసలిని అలవోకగా భుజాన వేసుకొని వేరొక చోటికి తరలించాడు. అలా భుజాలపై మొసలిని 300 మీటర్ల దూరం మోసుకెళ్లి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు. గ్రామస్తులకు మొసలి భయం తప్పించినందుకు అతడిని అందరూ ప్రశంసించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఓ వ్యక్తి కాలువలో కనిపించిన పెద్ద మొసలిని అలవోకగా భుజాన వేసుకొని వేరొక చోటికి తరలించాడు. అలా భుజాలపై మొసలిని 300 మీటర్ల దూరం మోసుకెళ్లి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు. గ్రామస్తులకు మొసలి భయం తప్పించినందుకు అతడిని అందరూ ప్రశంసించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. లలిత్‌పుర్‌ జిల్లాలో రాజ్‌వారా అనే గ్రామంలోని చెరువులో ఈ మొసలి కనిపించింది. భయాందోళనలకు గురైన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది, గ్రామానికి చెందిన సోహన్‌, సంజు అనే యువకుల సహాయంతో మొసలిని తాళ్లతో బంధించారు. అయితే అక్కడికి అటవీశాఖ సిబ్బంది వాహనం వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో .. ఈ మొసలిని అమాంతం తన భుజాలపై ఎత్తుకున్నాడు ఓ యువకుడు. 300 మీటర్ల దూరంలో ఉన్న అటవీశాఖ వాహనం వద్దకు చేర్చాడు. ఆ తర్వాత మొసలిని అటవీశాఖ అధికారులు సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. రియల్‌ బాహుబలి అంటూ అందరూ యువకుడిపై ప్రశంసలు కురిపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..