Dog Emotional: అయ్యా నీవెక్కడ..? కన్నీరు పెట్టిస్తున్న పెంపుడు కుక్క కథ..!
చనిపోయిన యజమాని కోసం.. ఇంటి ముందు వేచి ఉన్న కుక్క కథ.. ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది. ఉత్తరప్రదేశ్ మీరట్‌లో శాస్త్రి నగర్‌కు చెందిన పీయూష్ శర్మ, మధు శర్మ దంపతులు చోటు అనే కుక్కను పెంచుకున్నారు. అయితే..
చనిపోయిన యజమాని కోసం.. ఇంటి ముందు వేచి ఉన్న కుక్క కథ.. ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తోంది. ఉత్తరప్రదేశ్ మీరట్‌లో శాస్త్రి నగర్‌కు చెందిన పీయూష్ శర్మ, మధు శర్మ దంపతులు చోటు అనే కుక్కను పెంచుకున్నారు. అయితే.. గతేడాది డిసెంబర్ 10న మధు శర్మ గుండెపోటుతో మరణించారు. మధు శర్మ మరణించిన 20 రోజులకే.. ఆమె భర్త పీయూష్ శర్మ కూడా కన్నుమూశారు. దీంతో ఆ ఇల్లు ఇప్పుడు ఖాళీగా ఉంది. దానికి తాళం వేశారు. కానీ ఆ దంపతులు పెంచుకున్న కుక్క చోటు మాత్రం అక్కడి నుంచి వెళ్లడం లేదు. ఇంటి ముందే అటూఇటూ తిరుగుతూ తన యజమానుల కోసం ఎదురుచూస్తోంది. పీయూష్ శర్మ, మధు శర్మకు పిల్లలు లేరు. దీంతో చోటునే తమ సంతానంగా భావించి ఈ దంపతులు పెంచుకున్నారని.. చుట్టుపక్కల ఇళ్ల వారు చెబుతున్నారు. అయితే.. ఆ దంపతులు చనిపోవడంతో వారి మేనల్లుడు చోటూను ఇంటి నుంచి బయటకు పంపించి తాళం వేసి వెళ్లిపోయాడట. చోటూకు మధుతో బలమైన బంధం ఉందని చుట్టుపక్కల వారు తెలిపారు. మధు దంపతులు ఆ కుక్కకు ఏసీ గది కేటాయించి.. అల్లారుముద్దుగా చూసుకునేవారని.. చోటూతో భార్యా భర్తలిద్దరూ సంతోషంగా జీవించారని అన్నారు. ఇప్పుడు వారు లేకపోవడంతో.. చోటు అనాథగా మిగిలిపోయిందని.. స్థానిక ప్రజలు ఆ కుక్కను చూసుకుంటున్నారని చెప్పారు. ఆ వీధిలో ఉండేవారు తమ ఇళ్ల నుంచి దానికి ఆహారాన్ని తీసుకువస్తున్నారని.. అయినా చోటు మాత్రం ఆ ఇంటి ముందు నుంచి రావడం లేదని అంటున్నారు. చోటు విశ్వాసాన్ని చూసినవారంతా.. దాన్ని మెచ్చుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..