Shocking Incident: స్నేహితులను కలిసేందుకు వెళ్లి.. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు.. వైరల్ అవుతున్న వీడియో..

Updated on: Nov 11, 2021 | 9:12 AM

దేశ రాజధాని ఢిల్లీ శివారులోని గజియాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్ డోర్స్ తెరుచుకోకపోవడంతో దాదాపు గంట పాటు అందులో నుంచి ఎలా బయటపడాలో తెలియక నరకయాతన అనుభవించాడు.


దేశ రాజధాని ఢిల్లీ శివారులోని గజియాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్ డోర్స్ తెరుచుకోకపోవడంతో దాదాపు గంట పాటు అందులో నుంచి ఎలా బయటపడాలో తెలియక నరకయాతన అనుభవించాడు. గజియాబాద్‌ రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని కేడబ్ల్యూ శ్రిష్టి సొసైటీలోని డీ టవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అదే భవనంలో ఉన్న తన స్నేహితులను కలిసేందుకు లిఫ్ట్‌లో వెళ్తున్న సమయంలో అది ఒక్కసారిగా ఆగిపోవడంతో ఎవాన్ అనే బాలుడు అందులో చిక్కుకపోయాడు. అరిచినా ఎవరూ రాకపోవడంతో భయంతో వణికిపోయాడు. గాలి సరిగా రాకపోవడంతో తన బట్టలు తీసేశాడు. ఎట్టకేలకు అతి కష్టం మీద లిఫ్ట్ డోర్స్ తెరుచుకోవడంతో అందులో నుంచి బయటపడ్డాడు. ఈ మొత్తం వ్యవహారం లిఫ్ట్‌లోని సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.

లిఫ్ట్‌లో చిక్కుకుని దాదాపు గంట సమయం నరకయాతన అనుభవించిన ఎవాన్ మానసిక షాక్‌కు గురైనట్లు అతని కుటుంబీకులు చెబుతున్నారు. లిఫ్ట్ ఎక్కేందుకే భయపడుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్‌లో ఎవాన్ తండ్రి గౌరవ్ శర్మ ఫిర్యాదు చేశారు. లిఫ్ట్ మెయింటెనెన్స్ చేస్తున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపిన పోలీసులు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…