Boy Trending Video: ఈ చిన్నారి ఆనందానికి కారణం ఏంటో తెలుసా.. మీరే చూడండి..!

|

Dec 14, 2022 | 9:12 AM

చిన్న పిల్లలంటే అందరికి ఇష్టమే. వారు చేసే అల్లరి కూడా ఆనందంగా భరిస్తారు తల్లిదండ్రులు. తాజాగా ఓ చిన్నారి తెగ సంబరపడిపోతున్న వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.


వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్నారి ఓపెన్ చేసి ఉన్న ఫ్రిజ్ దగ్గర నిలబడి ఉంది. అందులో ఉన్న మద్యం బాటిల్ చూసి తెగ సంబరపడిపోతుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇంత చిన్న వయసులోనే ఆ చిన్నారికి మద్యం బాటిల్ గురించి ఎలా తెలిసిందా అనేదే. ‘ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం’ అని అందరికీ తెలుసు. దానిని త్రాగకూడదు. అయితే ఈ వీడియో విదేశాలకు చెందినదిగా తెలుస్తోంది. అయినా ఈ రోజుల్లో పిల్లలు కూడా చాలా తెలివి మీరిపోయారు. అందుకే వారికి సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియోను ‘‘మద్యం కనపడగానే ముఖంలో మెరుపు వచ్చేసింది’’ అనే కాప్షన్‌తో గుల్జార్‌ సాహబ్‌ అనే ట్విట్టర్‌ ఖాతాదారు తన ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షిస్తూ లైక్స్‌తో షేర్‌ చేస్తున్నారు. అంతేకాదు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఓ యూజర్ ‘బిడ్డకు కూడా తండ్రి బుద్దులే ఉన్నాయ’ని రాస్తే, ‘ఈరోజులు అలా తయారయ్యాయ’ని మరో యూజర్ రాశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 14, 2022 09:12 AM