Cash Seized: లారీ క్యాబిన్‌లో నోట్ల కట్టలు.. ఇంతకీ ఎవరివవి.?

|

May 12, 2024 | 4:14 PM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఎక్కడ చూసినా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. హైవేలు, ఇతర రోడ్లు అనే తేడా లేకుండా ఎక్కడికకక్కడ చెక్‌పోస్టులు పెట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు, వందల కేజీల బంగారం, భారీ మొత్తంలో మద్యం పోలీసుల తనిఖీల్లో సీజ్‌ చేశారు. తాజాగా మరోసారి భారీగా క్యాష్‌ పట్టుబడింది.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఎక్కడ చూసినా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. హైవేలు, ఇతర రోడ్లు అనే తేడా లేకుండా ఎక్కడికకక్కడ చెక్‌పోస్టులు పెట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు, వందల కేజీల బంగారం, భారీ మొత్తంలో మద్యం పోలీసుల తనిఖీల్లో సీజ్‌ చేశారు. తాజాగా మరోసారి భారీగా క్యాష్‌ పట్టుబడింది. దాదాపు ఎనిమిదిన్నరకోట్ల నగదు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా ఏపీ తెలంగాణ బార్డర్‌, జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు వద్ద.. భారీగా నగదు సీజ్‌ చేశారు.. హైదరాబాద్ నుండి గుంటూరుకు పైపుల లోడుతో వెళ్తున్న లారీలో భారీగా క్యాష్ తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైనశైలిలో తనిఖీలు చేయగా.. పైపుల లోడుతో వెళ్తున్న లారీలోపల ప్రత్యేక అరలో భారీగా క్యాష్‌ గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న 8.39 కోట్ల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, ఈ క్యాష్ ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరి కోసం తీసుకెళ్తున్నారు.. ఎవరు ఇచ్చారు? అనే కోణంలో విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: May 10, 2024 06:39 PM