Viral: ఇల్లెక్కి గుడ్డుపెట్టిన కోడి..! నేరుగా పెనంలోకే.. నవ్వులు పూయిస్తున్న వీడియో

|

Nov 17, 2023 | 9:21 PM

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని విజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా పంచుతుంటాయి. కొన్ని వీడియోలు ఎంతగానో నవ్విస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ కోడి ఇంటిపైకి ఎక్కి గుడ్డు పెట్టింది. అది నేరుగా వెళ్లి పొయ్యిమీద ఉన్న పెనంలో పడి ఆమ్లెట్‌ అయిపోయింది... ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిలో కొన్ని విజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా పంచుతుంటాయి. కొన్ని వీడియోలు ఎంతగానో నవ్విస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ కోడి ఇంటిపైకి ఎక్కి గుడ్డు పెట్టింది. అది నేరుగా వెళ్లి పొయ్యిమీద ఉన్న పెనంలో పడి ఆమ్లెట్‌ అయిపోయింది.. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ చోట రేకుల షేడ్డుతో వేసిన ఇంటిపై ఒక కోడి కూర్చుని ఉంది. సరిగ్గా కోడి గుడ్డుపెట్టే ప్రదేశానికి కింద ఓ వ్యక్తి వంటకు సిద్ధం చేస్తున్నాడు. రేకుల షెడ్డుపై కోడి గుడ్డు పెట్టగానే..అది నేరుగా జారుకుంటూ వచ్చి అతడు వంట చేసేందుకు పెట్టిన కడాయిలోకి పడింది.. షాక్‌ తిన్న అతను ఒక్కసారిగా పైకి చూసాడు. రేకుల షెడ్డుపైన ఓ తెల్లని కోడిపెట్ట నాపని అయిపోయింది ఏమైనా చేసుకో అన్నట్టుగా తాపీగా వెళ్తూ కనిపించింది. ఇంతలో కడాయిలో ఆమ్లెట్‌ రెడీ అయిపోయింది. పెంకు తీసి అవతల పడేసి ఆమ్లెట్ ప్లేట్‌లో పెట్టుకొని మిగతా వంట కంటిన్యూ చేశాడు ఆ వ్యక్తి. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న ఈ వీడియోని ఒకటిన్నర మిలియన్లమందికి పైగా వీక్షించారు. వాటే ఫన్నీ అంటూ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. ప్రకృతి చేసిన అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.