Viral Video: కంటతడి పెట్టించిన కన్న తండ్రి ఆరాటం.. వీడియో వైరల్.

|

Jun 21, 2024 | 9:09 AM

కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన అల్లు శిరీష అనే గర్భిణి కి నెలలు నిండకుండానే పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. అయితే నెలలు నిండకుండానే శిరీష ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బిడ్డ కు కాస్త పరిపక్వత వచ్చే వరకు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచాల్సి వచ్చింది.

కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన అల్లు శిరీష అనే గర్భిణి కి నెలలు నిండకుండానే పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. అయితే నెలలు నిండకుండానే శిరీష ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బిడ్డ కు కాస్త పరిపక్వత వచ్చే వరకు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచాల్సి వచ్చింది. ఇందులో శిశువుకు అవసరమైన పోషణ తో పాటు తల్లి గర్భం లాంటి ఆ యూనిట్ లో ఉంచడం ద్వారా సాధారణ జననం లాంటి సౌకర్యాన్ని కల్పిస్తారు. ఇతర అనారోగ్య సమస్యలు బారిన పడకుండా అది కాపాడుతుంది. దీంతో వైద్యులు శిశువును అందులో ఉంచాలని నిర్ణయించారు.

నెలలు నిండకుండానే జన్మించిన ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉండే NIICU కి తరలించాలని వైద్యులు సూచించారు. కానీ ఆ సమయానికి అక్కడ అవసరమైన సిబ్బంది అందుబాటులో లేరు. ఆ ఆక్సిజన్ సిలిండర్ ను మోసే శక్తి అక్కడ ఉన్న మహిళా సిబ్బంది కి లేదు. దీంతో ఆ శిశువు తండ్రి ఆ బాధ్యతను తీసుకున్నాడు.అత్యవసర పరిస్థితుల్లో అప్పుడే పుట్టిన బిడ్డను నర్సు తన చేతుల్లో పెట్టు కొని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు బయలుదేరగా సమయానికి సిబ్బంది లేక పోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకొని ఆమె వెంట నడవడం చూపరుల హృదయాలను తాకింది. కన్న బిడ్డను కాపాడుకోడానికి ఆ తండ్రి తపన కంటతడి పెట్టించింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో ఈసి సోషల్ మీడియా లో పెట్టారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ కావడంతో కే జీ హెచ్ సూపరెంటెండెంట్ డాక్టర్ శివానంద్ ఘటనపై ఆరా తీశారు. సంబంధిత వార్డు వైద్యులు, సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదే శించారు. ఇక నుంచి ఇలాంటి వాటికోసం బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.