Viral: ఈ రైతు ఐడియాకి నెటిజన్లు షాక్‌.. పొలం ఇలాకూడా దున్నుతారా..! వీడియో.

Viral: ఈ రైతు ఐడియాకి నెటిజన్లు షాక్‌.. పొలం ఇలాకూడా దున్నుతారా..! వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 14, 2023 | 7:48 AM

ఉపాయం ఉండాలేకానీ ఎలాంటి క్లిష్టపరిస్థితులనైనా ఎదుర్కోవచ్చని ఓ రైతు నిరూపించాడు. వ్యవసాయ పనుల్లో కూలీల సంఖ్యను తగ్గించేందుకు ఓ రైతు వినూత్న ప్రయోగం చేశాడు. పాత సైకిల్ తో కలుపు తీసే పరికరాన్ని రూపొందించాడు. కరోనా కంటే ముందు హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేసాడే. కరోనా మహమ్మారితో గ్రామానికి చేరిన మహేష్ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన మూడు

యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం లచ్చమ్మ గూడెంకు చెందిన గండికోట మహేష్ కరోనా కంటే ముందు హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేసాడే. కరోనా మహమ్మారితో గ్రామానికి చేరిన మహేష్ తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెట్టుబడులు పెరిగిపోవడం, దిగుబడి రాకపోవడంతో కూలీ ఖర్చులు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి వచ్చేసింది. దాంతో మూడేళ్లుగా పత్తి సాగు చేస్తున్న మహేష్‌కు పత్తి చేలో కలుపు తీయడం, గుంటుక కొట్టించడం ఇబ్బందిగా మారింది. కూలీల కొరతతో పాటు ఎద్దులతో గుంటుక కొట్టించడానికి ఖర్చు ఎక్కువవుతోంది. ఈ ఖర్చును ఎలాగైనా తగ్గించుకోవాలని ఆలోచించిన మహేష్‌ ఇంట్లో తన తండ్రి వాడిన పాత సైకిల్ తో ఓ ప్రయోగం చేశాడు. పాత సైకిల్ కు వ్యవసాయ పరికరాలను అమర్చి కలుపు తీయడం, గుంటుక కొట్టడం ప్రారంభించాడు. కూలీల కొరతను అధిగమించడం తోపాటు తక్కువ శ్రమతో ఎక్కువ పనిని చేసేందుకు ఈ సైకిల్ గుంటుక ఉపయోగపడుతుంది. ఈ సైకిల్ గుంటుక తయారీకి వెయ్యి రూపాయలు ఖర్చు అయిందని, ఒక ఎకరంలో ముగ్గురు కూలీలు చేసే పనిని ఈ సైకిల్ గుంటుకతో చేస్తున్నానని మహేష్ చెబుతున్నాడు. ఈ వినూత్న పరికరంతో కలుపు తీయడం, గుంటుక కొట్టడంతో ఎకరాకు 20 వేల రూపాయల వరకు ఆదా అవుతుందని మహేష్ చెబుతున్నాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయవచ్చని, మిగతా రైతులు కూడా ఇలా తయారుచేసుకొని ఖర్చు తగ్గించుకోవచ్చని చెబుతున్నాడు. మహేష్ ఆలోచనను స్థానిక రైతులు అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...