AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..

Viral: జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..

Anil kumar poka
|

Updated on: Oct 07, 2024 | 10:23 AM

Share

థాయ్‌ల్యాండ్‌కు చెందిన మొసళ్ల పెంపకందారు ప్రజల హితం కోరి ఎవరూ ఊహించని పని చేశాడు. ఇటీవల సంభవించిన వరదలతో మొసళ్లను పెంచుతున్న ఎన్‌క్లోజర్‌ గోడ దెబ్బతిని, బలహీనపడింది. ఆ గోడ ఏ క్షణాన్నైనా కూలొచ్చని, అదే జరిగితే అందులోని ప్రమాదకర మొసళ్లన్నీ జనవాసాల్లోకి ప్రవేశిస్తాయని అతను ఊహించాడు. జరగబోయే ప్రమాదంపై అధికారులకు సమాచారమిచ్చాడు.

థాయ్‌ల్యాండ్‌కు చెందిన మొసళ్ల పెంపకందారు ప్రజల హితం కోరి ఎవరూ ఊహించని పని చేశాడు. ఇటీవల సంభవించిన వరదలతో మొసళ్లను పెంచుతున్న ఎన్‌క్లోజర్‌ గోడ దెబ్బతిని, బలహీనపడింది. ఆ గోడ ఏ క్షణాన్నైనా కూలొచ్చని, అదే జరిగితే అందులోని ప్రమాదకర మొసళ్లన్నీ జనవాసాల్లోకి ప్రవేశిస్తాయని అతను ఊహించాడు. జరగబోయే ప్రమాదంపై అధికారులకు సమాచారమిచ్చాడు. వారు చెప్పిన సూచనల ప్రకారం 125కు పైగా మొసళ్లను ఏం చేశాడో చూడండి.

నత్థపక్‌ ఖుంకడ్‌ను థాయ్‌లాండ్‌లో అందరూ ‘క్రోకడైల్‌ ఎక్స్‌’గా పిలుచుకుంటారు. లుంఫున్‌ ప్రాంతంలో 17 ఏళ్లుగా సియామీస్‌ అనే అరుదైన రకం మొసళ్లను ఆయన పెంచుతున్నాడు. వీటి చర్మాన్ని పరిశ్రమలకు, మాంసాన్ని థాయ్‌ల్యాండ్‌తోపాటు ఇతర దేశాలకు పంపిస్తుంటాడు. అయితే సెప్టెంబర్‌ 21వ తేదీన థాయ్‌ల్యాండ్‌ ఉత్తర ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. నత్థపక్‌ ఫాంను కూడా వరద తాకింది. ఆ తీవ్రతకు మొసళ్ల ఎన్‌క్లోజర్‌ గోడ దెబ్బతింది. అది పూర్తిగా కూలితే మొసళ్లు సమీపంలోని ఆవాసాల్లోకి, పొలాల్లోకి ప్రవేశించి, జనాన్ని చంపేస్తాయని నత్థపక్‌ ఆందోళన చెందాడు.

మొసళ్లను వేరే చోటుకు తరలించాలని ప్రయత్నించినా వీలు పడలేదు. కుటుంబసభ్యులతో ఆలోచించిన మీదట..ప్రజలకు హాని కలిగించకుండా తామే వాటిని చంపేయడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయమై స్థానిక అధికారుల సలహా మేరకు.. మొత్తం 125 మొసళ్లకు కరెంట్ షాకిచ్చి చంపేశారు. ఇందులో అతి పెద్దదైన నాలుగు మీటర్ల పొడవుండే బ్రీడర్‌ మొసలి ‘అయి హర్న్‌’కూడా ఉంది. నత్థపక్‌ వద్ద ఇంకా అడుగు నుంచి నాలుగడుగుల వరకు పొడవైన 500 దాకా పిల్ల మొసళ్లున్నాయి. పిల్ల మొసళ్లతో కలిసి ఎన్‌క్లోజర్‌లో గడపటం, వాటితో చేసే విన్యాసాలతో అతని వీడియోలు ఇంటర్నెట్‌లో బాగా పాపులర్‌ అయ్యాయి కూడా. థాయ్‌ల్యాండ్‌లో మొసళ్ల పెంపకం ఆకర్షణీయమైన పరిశ్రమగా భారీ ఎత్తున సాగుతోంది. దేశంలో మొసళ్ల పెంపకందారులు 1,100 మంది వరకు ఉన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.