Viral Video: గొర్రెల మందలో వింతజంతువు.. బిక్కుబిక్కుమంటూ మూగజీవాలు.. వీడియో
గొర్రెల కాపరులు గొర్రెలను మందలుగా మేతకు తోలుకు వెళ్తుంటారు. అవి తన యజమాని చూపిన దారిలో తలవంచుకొని వెళ్లిపోతూ ఉంటాయి. అంతేకాదు వాటికి కాపలాగా కొందరు కుక్కలను కూడా తీసుకెళ్తుంటారు. అలా ఆ గొర్రెలతోపాటు వెళ్లే ఓ కుక్కకి తను కూడా గొర్రెలా మారితే ఎలాఉంటుంది అనుకున్నట్టుంది. చక్కగా గొర్రె చర్మం లాంటి ఓ దుప్పటిని కప్పుకుని ఆ గొర్రెల మంద మధ్యలో కూర్చుని ఉంది.
గొర్రెల కాపరులు గొర్రెలను మందలుగా మేతకు తోలుకు వెళ్తుంటారు. అవి తన యజమాని చూపిన దారిలో తలవంచుకొని వెళ్లిపోతూ ఉంటాయి. అంతేకాదు వాటికి కాపలాగా కొందరు కుక్కలను కూడా తీసుకెళ్తుంటారు. అలా ఆ గొర్రెలతోపాటు వెళ్లే ఓ కుక్కకి తను కూడా గొర్రెలా మారితే ఎలాఉంటుంది అనుకున్నట్టుంది. చక్కగా గొర్రె చర్మం లాంటి ఓ దుప్పటిని కప్పుకుని ఆ గొర్రెల మంద మధ్యలో కూర్చుని ఉంది. చూడ్డానికి అది గొర్రెలా కనిపించినా.. అక్కడున్న గొర్రెలకు మాత్రం అనుమానం వచ్చింది. ఏదో వింత జీవి మన మందలో చేరిందనుకుని భయం భయంగా దానివైపు చూస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో గొర్రెల మంద మధ్యలో గొర్రెలమాదిరిగా డ్రస్ చేసుకుని కూర్చున్న ఆ కుక్క నేనూ మీ వాడినే అన్నట్టుగా వాటివైపు చూస్తూ ఉంది. ఆ కుక్క గొర్రెలవైపు చూసినప్పుడు వాటి రియాక్షన్ చూస్తే నవ్వు ఆగదు. ఈ వీడియోను ఇప్పటికే లక్షా 70 వేలమందికి పైగా వీక్షించారు. అంతేకాదు వీడియో చూసి నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘అండర్ కవర్ డాగ్’ అని కొందరు, సీఐఏ ఏజెంట్ అని ఇంకొందరు కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

