Coconut : ఈ కొబ్బరి కాయ ధర రూ. 66 వేలు.. అంత ప్రత్యేకతేమంటే..? ఎక్కడంటే.?

Coconut : ఈ కొబ్బరి కాయ ధర రూ. 66 వేలు.. అంత ప్రత్యేకతేమంటే..? ఎక్కడంటే.?

Anil kumar poka

|

Updated on: Nov 06, 2022 | 5:27 PM

ఎక్కడైనా కొబ్బరి కాయ ధర 15 రూపాయలు ఉంటుంది. మహా అయితే డిమాండ్ పెరిగితే 30 నుంచి 50 రూపాయలు పలుకుతుంది. అలాంటి కోకోనట్ ఏకంగా 66వేల రూపాయలు పలికింది.


తమిళనాడులోని తేని జిల్లా బోడి ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం విశేష పూజలందుకుంటుంది. దేవాదాయ శాఖ ఆధీనంలోని ఈ ఆలయంలో స్కంద షష్టి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. వల్లీ, దేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పూజల్లో ఉంచిన వస్తువులను ఉత్సవాల ముగింపు సందర్భంగా వేలం వేశారు. ఈ వేలంలో ఓ కొబ్బరికాయను ఓ భక్తుడు ఏకంగా 66 వేల రూపాయలకు సొంతం చేసుకున్నాడు. గతేడాది 27 వేల రూపాయలు పలికిన కోకోనట్ ధర ఈ సారి అమాంతం రెండింతలకు పైగా పెరిగింది. ఇంట్లో ఈ కొబ్బరికాయను ఉంచి పూజలు నిర్వహిస్తే ఐశ్వర్యం పెరుగుతుందని భక్తుల నమ్మకం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Published on: Nov 06, 2022 05:27 PM