Rat – Child: బిందెలో పడి చనిపోయిన ఎలుక.. ఆ నీళ్లు తాగి చిన్నారి.. వీడియో.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బిందెలో ఎలుక పడిన నీటిని తాగి.. అస్వస్థతకు గురైన ఓ చిన్నారి మరణించాడు. ఈ విషాద ఘటన గుంటూరు రూరల్ మండలం చల్లావారిపాలెంలో చోటుచేసుకుంది.
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తాగునీటి బిందెలో ఎలుక పడి చనిపోయింది. ఆ నీరు కలుషతమైంది. అది చూసుకోకుండా.. ఆరేళ్ల చిన్నారి ఉసర్తి ప్రభు దివ్య తేజ ఆ నీటిని తాగాడు. తేజ నీరు తాగిన అనంతరం అస్వస్థతకు గురయ్యాడు. ఏకధాటిగా వాంతులయ్యాయి.ఈ క్రమంలో బిందెలో ఎలుకపడి చనిపోయినట్లు గమనించిన కుటుంబ సభ్యులు.. తేజను వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి తేజ సోమవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న చిన్నారి మరణించడంతో తల్లీదండ్రులు గుండెలవిసేలా రోధించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

