Cow: ఓకే కాన్సులో నాలుగుదూడలకు జన్మనించిన ఆవు.. ఏడు లక్షల ఆవుల్లో జరిగే అరుదైన సంఘటన.
ఏడు లక్షల ఆవుల్లో ఒక ఆవుకు జరిగే అరుదైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జెర్సీ ఆవు ఒకే కాన్పులో నాలుగు దూడలకు జన్మనించింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఏడు లక్షల ఆవుల్లో ఒక ఆవుకు జరిగే అరుదైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జెర్సీ ఆవు ఒకే కాన్పులో నాలుగు దూడలకు జన్మనించింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి గోశాలలో జెర్సీ ఆవులను పెంచుకుంటున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పశు వైద్యశాలలో ఆవుకు కృత్తిమ సంతానోత్పత్తి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. 9 నెలల అనంతరం రెండు మగ దూడలు, రెండు ఆడ దూడలకు జన్మనిచ్చింది. ఆ దూడలు జన్మించిన వెంటనే ఒక గిత్త దూడ బ్రతికి ఉండగా మిగిలిన మూడు దూడలు చనిపోయినట్లు రైతు తెలిపారు. ఏడు లక్షల ఆవుల్లో ఒక ఆవుకు ఇలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకుంటుందని వైద్యుడు భానుప్రసాద్ తెలిపారు. కాగా బ్రతికి ఉన్న గిత్త దూడ ఆరోగ్యకరంగా ఉందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

