Viral: విమానంలో భార్యాభర్తల ఫైటింగ్‌.. విమాన సిబ్బంది ఏం చేశారో తెలుసా.?

|

Nov 30, 2023 | 6:13 PM

కీచులాడుకోకపోతే వాళ్లసలు భార్యభర్తలే కాదనేవారు పెద్దలు. కానీ ఆ కీచులాటలు కాస్తా పోట్లాటలుగా మారి, హద్దుమీరి, సరిహద్దులు దాటితే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఓ జంట విమానంలో ప్రయాణిస్తోంది. ఉన్నట్టుండి ఆ దంపతుల మధ్య గొడవ మొదలైంది. వారిని శాంత పరిచేందుకు తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది విఫల యత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. దాంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది.

కీచులాడుకోకపోతే వాళ్లసలు భార్యభర్తలే కాదనేవారు పెద్దలు. కానీ ఆ కీచులాటలు కాస్తా పోట్లాటలుగా మారి, హద్దుమీరి, సరిహద్దులు దాటితే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఓ జంట విమానంలో ప్రయాణిస్తోంది. ఉన్నట్టుండి ఆ దంపతుల మధ్య గొడవ మొదలైంది. వారిని శాంత పరిచేందుకు తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది విఫల యత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. దాంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ కు చెందిన LH-772 విమానం జర్మనీలోని మ్యూనిచ్ నుంచి థాయ్ లాండ్ లోని బ్యాంకాక్‌కు వెళుతోంది. అయితే, విమానం గాల్లో ఉండగా ఓ జంట జగడానికి దిగింది. దంపతులు ఇరువురూ కీచులాడుకోవడంతో విమానంలో గందరగోళం ఏర్పడింది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడికి ప్రయత్నించడంతో వారికి సర్దిచెప్పేందుకు విమాన సిబ్బంది విఫలయత్నాలు చేశారు. దాంతో, చేసేది లేక విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు యత్నించారు. అప్పటికి విమానం పాకిస్థాన్ గగనతలంపై ఉంది. పాక్ లోని ఓ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ కు అనుమతి కోరగా, అక్కడి అధికారులు నిరాకరించారు. దాంతో ఆ విమానాన్ని ఢిల్లీ వైపు మళ్లించారు. ఢిల్లీలో అధికారులు అనుమతించడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వెంటనే భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకోగా, భర్తను విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.