Flight-Bullet: అవును ఇది నిజమే.. ఆకాశంలో ఎగురుతున్న విమానంలోకి దూసుకొచ్చిన బులెట్..!

Updated on: Oct 09, 2022 | 5:26 PM

మయన్మార్ నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం నెపిడో నగరం నుంచి లోయికా సిటీకి బయల్దేరింది. ల్యాండింగ్ కు సిద్ధమవుతుండగా, విమానం గోడలను చీల్చుకుంటూ ఓ తూటా దూసుకొచ్చింది.


మయన్మార్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. గాల్లో 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలోకి బుల్లెట్‌ దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు.మయన్మార్ నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం నెపిడో నగరం నుంచి లోయికా సిటీకి బయల్దేరింది. ల్యాండింగ్ కు సిద్ధమవుతుండగా, విమానం గోడలను చీల్చుకుంటూ ఓ తూటా దూసుకొచ్చింది. విండో పక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడి చెంపకు గాయం చేసింది. దాంతో విమానంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన ప్రయాణికుడిని విమానం ల్యాండ్ అయిన తర్వాత హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. తూటా ఘటనపై మయన్మార్ సైనిక ప్రభుత్వం స్పందించింది. లోయికా సిటీకి విమానాలను రద్దు చేసింది. విమానాశ్రయం వద్ద భారీగా సైనికులను రంగంలోకి దించింది. ఇది తమ ప్రత్యర్థి పక్షం కరెన్ నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీ (కేఎన్ పీపీ) పనే అని మయన్మార్ సైనిక ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను కేఎన్ పీపీ ఖండించింది. జరిగిన ఘటనలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Snake acting: అబ్బా ఎం యాక్టింగ్ గురు..! ఈ పాము స్టార్‌ హీరోలను మించిపోయిందిగా.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందే

Published on: Oct 09, 2022 05:26 PM