Rat missing: ‛సార్.. ఎలుక కనిపించట్లేదు కాస్త వెతికి పెట్టరూ’.. పోలీసుకు ఫిర్యాదు.! (వీడియో)
సజ్జన్‌గఢ్ ప్రాంతంలోని పడ్లా వాఢ్కియా గ్రామంలో ఎంతో ప్రేమగా పెంచుకునే ఎలుక కనిపింకకుండా పోయిందంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా..
ఇంట్లో డబ్బులు, నగలు, విలువైన వస్తువులు పోయాయని కంప్లైంట్ ఇవ్వడం కామన్. కానీ, పెంచుకునే పెంపుడు జంతువులు కనిపించకుండా పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం వెరైటీ. ప్రస్తుతం చాలా మంది ఇంట్లో తమతో పాటు పెట్స్‌ను పెంచుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాటిని సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటూ మురిసిపోతుంటారు. వారు ఎక్కడికి వెళ్లినా.. వెంట తీసుకెళ్లడం, వాటి అవసరాలు తీర్చడం, పనులు నేర్పించడం వంటివి చేస్తుంటారు. అవి కనిపించకుడా పోతే తెగ బాధపడిపోతుంటారు. తాజాగా రాజస్థాన్ లో ఇలాంటి ఘటనే జరిగింది. సజ్జన్‌గఢ్ ప్రాంతంలోని పడ్లా వాఢ్కియా గ్రామంలో ఎంతో ప్రేమగా పెంచుకునే ఎలుక కనిపింకకుండా పోయిందంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా ఎత్తుకెళ్లినవారు కూడా తెలుసునని అనుమానం వ్యక్తం చేశాడు. అతని ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఘటనపై చివరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన అరుదైన ఫిర్యాదు చూసి జనం నవ్వుకుంటుంటే, ఎలుక దొంగను ఎలా పట్టుకోవాలో తెలీక పోలీసులు తికమక పడిపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..