Viral Video: వందేళ్ల జీవిత ప్రయాణంలో పెళ్లి అనేది ముఖ్యమైన మజిలీ లాంటిది అని చెబుతుంటారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి కోసం కోటి కలలు కంటుంటారు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వరుడు, తనను బాగా చూసుకునే అబ్బాయితో జీవితం పంచుకోవాలని వధువు ఆశిస్తుంటుంది. ఇలా ఎన్నో ఎమోషన్స్‌కు పెళ్లికి కేరాఫ్ అడ్రస్. అలాంటి అద్భుత క్షణం కళ్ల ముందు నిజమైన సమయంలో భావోద్వేగానికి గురి కావడం సర్వసాధారణమైన విషయం. అయితే ఈ ఎమోషన్ కేవలం మహిళలకే అనే భావన మనలో చాల మందికి ఉండే ఉంటుంది. సమజాం మనపై వేసిన ముద్ర అలాంటిది.
కానీ భావోద్వేగాలు ఎవరికైనా సమానంగా ఉంటాయి. దానికి ఆడ, మగ అనే తేడా ఉండదు. అయితే సమాజంలో ఆడవారి ఎమోషన్స్‌కు ఇచ్చిన ప్రాధాన్యత మగవారికి ఇవ్వరు. అంతటితో ఆగకుండా ‘ఏడిచే మగాడిని నమ్మకూడదు’ అని స్టేట్‌మెంట్స్ కూడా ఇస్తుంటారు. కానీ మగవారు కూడా మనుషులే కదా.. వారికి ఏడుపొస్తుంది కదా. ఇప్పుడిదంతా ఎందుకనేగా మీ సందేహం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తుంటే మగవారు కూడా ఎమోషన్స్‌కు అతీతులేం కాదని చెప్పకనే చెబుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ జంట పెళ్లి బంధంతో ఒకటవుతోంది.
ఈ తరుణంలో వదువుకి మంగళ సూత్రం కట్టే సమయంలో పెళ్లి కొడుకు ఒక్కసారిగా ఎమోషన్‌కు గురయ్యాడు. చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు.. దీంతో ఇది చూసిన పెళ్లి కూతురు మొదట్లో కంగారు పడుతూ తాను భావోద్వేగానికి గురైనా. కాబోయే వాడు తనను ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థమై ముసిముసి నవ్వులు నవ్వేసింది. అనంతరం వరుడు, పెళ్లి కూతురు బుగ్గపై ఓ ముద్దివ్వగానే సిగ్గుల మొగ్గైందా నవ వధువు. ఇదంతా వెడ్డింగ్ షూటింగ్ కెమెరాల్లో రికార్డ్ అయిపోయింది. ఈ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది. వరుడు ఏడ్చినా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు క్యూట్ కపుల్ అంటూ కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.
Also Read: Milk Price Increase: సామాన్యులకు మరో భారం.. ఆ పాల ధరలు మరోసారి పెరగనున్నాయా..?
Sarkaru Vaari Paata : మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఫ్యాన్స్ ఖుషి..