Boy Viral Video: ట్రైన్‌లో పాటతో అదరగొట్టిన బాలుడు.. ట్విట్టర్ వీడియోకు లక్షకు పైగా వీక్షణలు..
ఎనిమిదేళ్ల బాలుడు రైలులో తన క్లాసికల్ మ్యూజిక్ పెర్ఫామెన్స్‌తో తోటి ప్రయాణీకులను ఆకట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నైకి చెందిన సూర్యనారాయణన్
ఎనిమిదేళ్ల బాలుడు రైలులో తన క్లాసికల్ మ్యూజిక్ పెర్ఫామెన్స్‌తో తోటి ప్రయాణీకులను ఆకట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నైకి చెందిన సూర్యనారాయణన్ అనే బాలుడు అద్భుత మ్యూజిక్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న వీడియోను సంగీత వెరియర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. వారణాసిలోని కాశీ తమిళ సంగమం నుంచి తిరుగుప్రయాణంలో అప్పర్ బెర్త్‌లో కూర్చున్న బాలుడు తన గాత్రంతో ప్రయాణీకులను అలరించాడు.బాలుడి సంగీతాన్ని విన్న నెటిజన్లు సైతం అతనిపై ప్రశంసలు గుప్పించారు. బాలుడి మెలోడియస్ వాయిస్ అక్కడున్న వారందరినీ తన్మయత్వంలో ముంచెత్తింది. కోచ్‌లో ఉన్న ప్రయాణీకులంతా సూర్యనారాయణన్ పాడుతున్న తీరును మెచ్చుకుంటూ అతడి చుట్టూ చేరడం కనిపించింది. ట్రైన్ అప్పర్‌బెర్త్ వేదికగా క్లాసికల్ కన్సర్ట్! చెన్నైకి చెందిన సూర్యనారాయణన్..అతడి గాత్రం స్పీచ్‌లెస్ అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి లక్ష మందికి పైగా వీక్షించారు. బాలుడి గాత్ర మాధుర్యం అద్భుతమని ఓ యూజర్ కామెంట్ చేయగా, అతడు ఏం పాట పాడుతున్నాడో అర్ధం కాకపోయినా, అది తమలో దైవిక భావం రేకెత్తించిందని మరో యూజర్ రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos