Bear Video: అర్ధరాత్రి ఇళ్లమధ్యకు ఎలుగుబంటి.. అడవులు దాటి జనసంచారంలోకి..

|

Aug 15, 2023 | 4:44 PM

అడవుల్లో వుండాల్సిన మృగాలు జనసంచారంలోకి వస్తుండటంతో జనాలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయంతో జంకుతున్నారు. ఆహారం కోసం వన్య మృగాలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ సమీపంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది.

అడవుల్లో వుండాల్సిన మృగాలు జనసంచారంలోకి వస్తుండటంతో జనాలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయంతో జంకుతున్నారు. ఆహారం కోసం వన్య మృగాలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ సమీపంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి ఇళ్లమధ్య ఎలుగుబంటిని గుర్తించిన స్థానికులు దానిని తరిమే ప్రయత్నం చేశారు. దాంతో ఎలుగుబంటి స్థానిక అటవీప్రాంతంలోకి పారిపోయింది. అర్ధరాత్రి ఎలుగుబంటి వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ విషయాన్ని స్థానికులు అటవీ అధికారులకు తెలియజేశారు. రంగంలోకి దిగిన అటవీ అధికారులు సీసీ పుటేజీని పరిశీలించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలుగుబంటిని త్వరలోనే పట్టుకుంటామని ధైర్యం చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...