Bear: బైక్‌పై వెళ్తున్న వారిపై దాడిచేసిన ఎలుగుబంటి.. అంతటితో ఆగకుండా రెచ్చిపోయి.. వైరల్ వీడియో.

Updated on: Nov 10, 2022 | 8:46 PM

తమిళనాడులో అడవి ఎలుగుబంటి ఆవేశంలో రెచ్చిపోయింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అడ్డుకునే ప్రయత్నం చేసిన మరో ముగ్గురినీ గాయపరిచింది. ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.


తెన్‌కాశిలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. వైకుంఠమణి అనే వ్యక్తి మసాలా దినుసులు తీసుకుని తన బైక్‌ మీద వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఉన్న అటవీ ప్రాతాన్ని దాటుతుండగా పొదల్లో నక్కిఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా అతనిపై దాడిచేసింది. బైక్‌ మీద నుంచి పడిపోయిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచింది. అతనిపై కూర్చున్న ఎలుగుబంటి అతడి తలను కొరుకుతూ, గోళ్లలో రక్కుతూ దాడి చేసింది.ఇది గమనించిన స్థానికులు ఎలుగుబంటిపై రాళ్లు విసరడంతో వాళ్లు మీదకు దూసుకెళ్లి వారిని సైతం గాయపరిచింది. దీంతో మరో ఇద్దరు గాయపడ్డారు. అటుగా వస్తున్న మరికొంత మంది ఎలుగుబండిని బెదరించడంతో ఎలుగు.. అక్కడి నుంచి పారిపోయింది. ఎలుగుబంటి దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Nov 10, 2022 08:46 PM