Woman – Journalist: పోలీసుల ముందే జర్నలిస్ట్ చెంప చెల్లుమనిపించిన మహిళ.. ఈ ఓవర్ యాక్షనే తగ్గించుకుంటే మంచిది..!
మధ్యప్రదేశ్‌లో ఓ జర్నలిస్టుకు అనుకోని ఘటన ఎదురైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో గురించి అడినందుకు జర్నలిస్ట్ చెంప చెల్లుమనిపించింది ఓ మహిళ. ఇండోర్‌లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో గురించి అడినందుకు జర్నలిస్ట్ చెంప చెల్లుమనిపించింది ఓ మహిళ. ఇండోర్‌లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులోని మహిళ, డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తిపై అరిచింది. తనను విడిచిపెట్టాలంటూ ఆ కారు నుంచి దిగింది. అటుగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ ఇండోర్‌లోని విజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తన కజిన్‌తో వాగ్వాదం జరిగిందని, తాము ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులకు చెప్పింది. ఆ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సదరు మహిళ ఫిర్యాదు చేసింది. మరోవైపు ఈ విషయం తెలిసిన మీడియా సిబ్బంది ఆ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వైరల్ అయిన కారు వీడియోపై ఆమె వివరణ కోరారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తూనే ఆ మహిళ ఒక జర్నలిస్ట్ చెంపపై కొట్టి అక్కడి నుంచి పరుగులు తీసింది. దీంతో మీడియా సిబ్బంది, పోలీసులు ఆమె వెంటపడ్డారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

