Viral: విశాఖ జూలో దారుణం.. కేర్‌ టేకర్‌పై ఎలుగుబంటి దాడి.. వీడియో వైరల్.

|

Nov 29, 2023 | 6:42 PM

విశాఖపట్టణంలోని పర్యాటక ప్రాంతాల్లోఇందిరా గాంధీ జూ పార్క్‌ ఒకటి. ఎన్నో రకాల జంతువులతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ జూ పార్క్ లో సోమవారం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న నగేష్ అనే యువకుడు పై ఎలుగుబంటి దాడి చేసింది. సోమవారం ఉదయం జూ పార్క్ లో ఎలుగుబంటి ఎన్ క్లోజర్ పరిసరాల్లో నగేష్ క్లీన్ చేస్తుండగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది.

విశాఖపట్టణంలోని పర్యాటక ప్రాంతాల్లోఇందిరా గాంధీ జూ పార్క్‌ ఒకటి. ఎన్నో రకాల జంతువులతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ జూ పార్క్ లో సోమవారం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న నగేష్ అనే యువకుడు పై ఎలుగుబంటి దాడి చేసింది. సోమవారం ఉదయం జూ పార్క్ లో ఎలుగుబంటి ఎన్ క్లోజర్ పరిసరాల్లో నగేష్ క్లీన్ చేస్తుండగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. వాస్తవంగా ఎన్ క్లోజర్ శుభ్రం చేసే సమయంలో ఎలుగుబంటి ఎన్ క్లోజర్ గేట్ మూసి వేసి ఉండాలి. అయితే ఆ గేట్ ఓపెన్ అయ్యి ఉండడం తో బయటకు వచ్చిన ఎలుగుబంటి ఒక్కసారిగా నగేష్ పై దాడికి పాల్పడింది. నగేష్ పై ఎలుగుబంటి దాడి చేస్తున్న సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో సందర్శకులు కూడా ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఈ ఎలుగుబంటి ఆ యువకుడి పై దాడి చేయడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన జూ అధికారులు ఎలుగుబంటిని బంధించారు. తీవ్ర గాయాల పాలైన నగేష్ ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. క్లీనింగ్‌ చేసే సమయంలో ఎలుగుబంటిని ఎన్‌క్లోజర్‌లో వేసి గేటు లాక్‌ చేయడం మర్చిపోయాడని, దాంతో ఎలుగుబంటి బయటకు వచ్చి అతనిపై దాడి చేసినట్లు జూ అధికారులు తెలిపారు. మృతుని కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.