Child Cute Video: అంత చిన్న వయసులో ఏం కష్టం వచ్చిందో.. నెత్తి బాదుకుంటున్న చిన్నారి.. క్యూట్‌ వీడియో

|

Jan 12, 2023 | 9:32 AM

చిన్నారులు.. చాలా ముద్దుగా అందంగా ఉంటారు. వారు చేసే చిట్టి చిట్టి పనులు ఎంతో ముచ్చట కలిగిస్తుంటాయి. కల్మషం లేని మనసుతో వారు చేసే పనులు ఉద్వేగం కలిగిస్తాయి.


చిన్నారులు.. చాలా ముద్దుగా అందంగా ఉంటారు. వారు చేసే చిట్టి చిట్టి పనులు ఎంతో ముచ్చట కలిగిస్తుంటాయి. కల్మషం లేని మనసుతో వారు చేసే పనులు ఉద్వేగం కలిగిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చూశాక మీ పెదాలపై కచ్చితంగా చిరునవ్వు వస్తుంది. ఈ వీడియోలో.. ఒక చిన్న పిల్లవాడు తన నోటిలో బొమ్మను పెట్టుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈక్రమంలో తాను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు తలపై తన చేతులతో కొట్టుకుంటున్నాడు. టెన్షన్ పడుతున్నట్టుగా పదే పదే అలా చేశాడు. అతని పరిస్థితి చూస్తే.. ఇంత చిన్న వయసులోనే అంత కష్టం ఏమొచ్చిందా అనే డౌట్ రాక మానదు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇది క్షణాల్లో వైరల్ గా మారింది. ట్విట్టర్ లో పోస్ట్ అయిన ఈ వీడియోను 10 లక్షలమందికి పైగా వీక్షించారు. వేలల్లో లైక్‌ చేస్తూ..కామెంట్లు చేస్తున్నారు. ఓరి బుడ్డోడా.. ఈ వయసులో అంతకష్టమేమొచ్చింది నీకు అంటూ చిన్నారి చిలిపి చేష్టకు ఫిదా అయిపోతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 12, 2023 09:32 AM