Old woman viral video: 80 ఏళ్ల వయసులో మారథాన్ రేస్ పరుగెత్తిన బామ్మ..! ఇది నిజంగా గొప్ప విషయమే..వీడియో.

Old woman viral video: 80 ఏళ్ల వయసులో మారథాన్ రేస్ పరుగెత్తిన బామ్మ..! ఇది నిజంగా గొప్ప విషయమే..వీడియో.

Anil kumar poka

|

Updated on: Jan 27, 2023 | 9:39 AM

80 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండేంత అదృష్టం అతి కొద్ది మందికేనని చెప్పొచ్చు. అలాంటి వయసులో ఓ బామ్మ ఏకంగా పరుగు పందెంలో హుషారుగా పాల్గొన్నారు. 18వ ఎడిషన్ టాటా ముంబై


80 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండేంత అదృష్టం అతి కొద్ది మందికేనని చెప్పొచ్చు. అలాంటి వయసులో ఓ బామ్మ ఏకంగా పరుగు పందెంలో హుషారుగా పాల్గొన్నారు. 18వ ఎడిషన్ టాటా ముంబై మారథాన్ కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. ముంబై వాసులు ఈ పరుగులో పాల్గొనగా.. భారతి అనే వృద్దురాలు చీర కట్టుకుని, కాళ్లకు షూ ధరించిన ఓ బామ్మ వారితో కలసి పరుగు అందుకున్నారు. ఆమెను చూసిన చాలా మంది ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది. ఆమె మనవరాలు డింపుల్ మెహతా ఫెర్నాండెజ్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. యువతరానికి బామ్మ మంచి స్ఫూర్తినీయం అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. 18వ ఎడిషన్ టాటా ముంబై మారథాన్ కార్యక్రమంలో 55 వేలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. అందరిలో ఈ బామ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చేతితో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని.. 4.2 కిలోమీటర్ల దూరాన్ని 51 నిమిషాల్లో చేరుకున్నారు. మారథాన్‌లో ఈ బామ్మ పాల్గొనడం ఇది ఐదోసారి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 27, 2023 09:38 AM