Burning Man festival: ఒక్కసారిగా ఎడారిలో భారీ వర్షం.. బురదలో చిక్కుకున్న 70 వేల మంది.

Burning Man festival: ఒక్కసారిగా ఎడారిలో భారీ వర్షం.. బురదలో చిక్కుకున్న 70 వేల మంది.

Anil kumar poka

|

Updated on: Sep 05, 2023 | 9:41 AM

అమెరికాలో ఎడారి మధ్యలో నిర్వహించే అతిపెద్ద వేడుకైన బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌కు పెద్ద చిక్కొచ్చి పడింది. అనుకోకుండా కురిసిన వర్షానికి ఎడారి మొత్తం బురద మయంగా మారిపోయింది. ఎవరూ అక్కడి నుంచి బయటపడలేని పరిస్థితి నెలకొంది. నెవాడలోని బ్లాక్‌రాక్‌ ఎడారి వర్షం దెబ్బకు బురదతో కూరుక్కుపోయింది. దీంతో ఈ ఫెస్టివల్‌కు హాజరైన 70 వేల మంది చిక్కుకుపోయారు. చుట్టూ పదుల మైళ్ల దూరం వరకు ఎటు చూసినా బురదే కనిపిస్తోంది.

అమెరికాలో ఎడారి మధ్యలో నిర్వహించే అతిపెద్ద వేడుకైన బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌కు పెద్ద చిక్కొచ్చి పడింది. అనుకోకుండా కురిసిన వర్షానికి ఎడారి మొత్తం బురద మయంగా మారిపోయింది. ఎవరూ అక్కడి నుంచి బయటపడలేని పరిస్థితి నెలకొంది. నెవాడలోని బ్లాక్‌రాక్‌ ఎడారి వర్షం దెబ్బకు బురదతో కూరుక్కుపోయింది. దీంతో ఈ ఫెస్టివల్‌కు హాజరైన 70 వేల మంది చిక్కుకుపోయారు. చుట్టూ పదుల మైళ్ల దూరం వరకు ఎటు చూసినా బురదే కనిపిస్తోంది. కాళ్లు కూరుకుపోతుండటంతో పది అడుగులు కూడా వేయలేని పరిస్థితి. వాహనాలు ముందుకు కదల్లేక పోతున్నాయి. ఆగస్టు 27న బర్నింగ్‌మ్యాన్‌ ఫెస్టివల్‌ మొదలైంది. ఆ తర్వాత ఈ ప్రదేశాన్ని హిల్లరి హరికేన్‌ తాకింది. ఒక రాత్రి మొత్తం భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతం మొత్తం బురదగా మారిపోయింది. మూడు నెలల్లో పడాల్సిన వర్షం ఒక్కరాత్రిలో కురిసింది. దీంతో చాలా ఈవెంట్లు రద్దయ్యాయి. ఎవరూ ఇక్కడికి రావడానికి లేదా.. బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో బ్లాక్‌రాక్‌ సిటీని మూసివేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. కొంత మంది మాత్రం కాలి నడకనే ఈ బురద ఎడారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మరోవైపు భూమి ఉపరితలం ఎండిపోయే వరకు వాహనలను ముందుకు అనుమతించమని ఇప్పటికే నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలతో వెచ్చటి ప్రదేశంలో తలదాచుకోవాలని సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..