పేర్చిన వస్తువులు టకటకా పడిపోతున్నాయ్..! తొంగి చూస్తే హడల్
ఇటీవల విశాఖ నేవల్ క్యాంటీన్‌లో 7 అడుగుల భారీ పాము కలకలం సృష్టించింది. సిబ్బంది వస్తువులు కింద పడటంతో ర్యాక్‌లో పామును చూసి భయపడ్డారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజు వచ్చి, చాకచక్యంగా పామును పట్టుకుని సురక్షితంగా రెస్క్యూ చేశారు. దీంతో క్యాంటీన్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల పాములు ఎక్కడపడితే అక్కడ తిష్ట వేస్తూ జనాలను పరుగులు పెట్టిస్తున్నాయి. తాజాగా నేవీ ఉద్యోగులకు షాకిచ్చింది ఓ పెద్దపాము నేవల్ క్యాంటీన్‌లో ఏడడుగుల పొడవైన పామును చూసి భయంతో పరుగులు తీశారు క్యాంటీన్ సిబ్బంది. ఈ ఘటన విశాఖలోని నేవల్ క్యాంటీన్‌లో జరిగింది. నేవీ ఉద్యోగులు అధికారులంతా అక్కడ నుంచే నిత్యావసరాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోజు మాదిరిగానే ఉదయాన్నే క్యాంటీన్ ఓపెన్ చేసిన సిబ్బంది లోపలికి వెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో అక్కడ ఓ ర్యాక్ లో పేర్చిన వస్తువులు ఒక్కొక్కటిగా కింద పడుతున్నాయి. ఓ వ్యక్తి కిందపడిన వాటిని తీసి మళ్ళీ పెడుతున్నాడు. ఈ క్రమంలో ఆ ర్యాక్‌లో ఏదో కదిలినట్టు అనిపించింది. ఎలుకలేమైనా వచ్చాయా అని కాస్త లోపలకు తొంగి చూసిన అతనికి గుండె ఆగినంత పనయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. ఏడడుగుల పొడవున్న పాము నిపించింది. వెంటనే తోటి సిబ్బందిని అలర్ట్ చేశాడు. వారంతా అక్కడికి వచ్చి భారీ పామును చూసి హడలిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన నాగరాజు… ఏడడుగుల పొడవున్న పామును చాకచక్యంగా రెస్క్యూ చేశాడు. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రీ రిలీజ్‌లో మాటల తూటాలు.. వీటితో టిక్కెట్లు తెగుతాయా ??
మనం అనుకున్నదొక్కటి.. అక్కడ చూపించింది ఇంకొకటి!
పైరసీ ఇష్యూ.. ఇండస్ట్రీకి ఏం నేర్పింది
ఉస్తాద్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సమ్మర్‌లోనే సందడి !!
ఆంధ్రాకింగ్ రామ్‌కి సక్సెస్ తెచ్చిపెడుతుందా ??
