66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా

|

Sep 09, 2024 | 7:33 PM

వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా షురూ అయ్యాయి. బొజ్జ గణపయ్య కోసం ఊరూరా, వాడవాడలా అందమైన మండపాలను ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో లంబోదరుడి ప్రతిమలతో ప్రతి వీధి కళకళలాడుతోంది. వినాయక వేడుకల్లో ముంబయిలోని ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్‌ వారి మహాగణపతి ప్రతీఏటా ప్రత్యేకంగా నిలుస్తున్నది.

వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా షురూ అయ్యాయి. బొజ్జ గణపయ్య కోసం ఊరూరా, వాడవాడలా అందమైన మండపాలను ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో లంబోదరుడి ప్రతిమలతో ప్రతి వీధి కళకళలాడుతోంది. వినాయక వేడుకల్లో ముంబయిలోని ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్‌ వారి మహాగణపతి ప్రతీఏటా ప్రత్యేకంగా నిలుస్తున్నది. దేశంలోనే సంపన్న వినాయకుడిగా పేరొందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈ ఏడాది ఏకంగా 400 కోట్ల రూపాయలతో బీమా చేయించారట. ఇక్కడి విగ్రహాన్ని భారీఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించడమే ఇందుక్కారణం. ముంబయి శివారులోని మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్‌బీ సేవామండల్‌ వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈసారి 70వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. ఈ మండపంలోని గణపయ్య విగ్రహాన్ని ఏకంగా 66 కిలోల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. దీంతో ముందుజాగ్రత్తగా ఈ వేడుకలకు 400.58 కోట్ల రూపాయలతో బీమా చేయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. సెప్టెంబరు 11 వరకు ఐదు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ దొంగ.. వినాయక చవితి రోజే గణేశుడి లడ్డూ కొట్టేశాడు !!

కిస్మిస్‌ గణపతి.. బాదం గణపతి.. ఆకట్టుకుంటున్న గణనాధులు

7 కోట్ల ఏళ్ల క్రితం అంబర్‌ శిలాజం !! ఇంటి మెట్టుగా వాడుకున్న బామ్మ !!

Follow us on