వజ్రాలు.. వైఢూర్యాల కోసం అర్థరాత్రి ఏం చేశారో తెలుసా ??

వజ్రాలు.. వైఢూర్యాల కోసం అర్థరాత్రి ఏం చేశారో తెలుసా ??

Phani CH

|

Updated on: Oct 07, 2023 | 9:00 AM

సత్యసాయి జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి కేటుగాళ్లు ఏకంగా జేసీబీలతో తవ్వకాలు జరిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. నలుగురు కేటుగాళ్లను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. జిల్లాలోని అమరాపురం మండలం పేలుబండ చెరువు సమీపంలో అర్దరాత్రి గుప్త నిధుల కోసం జెసిబితో తవ్వకాలు జరిపారు దుండగులు. అర్ధరాత్రి గ్రామ శివారులో డ్రిల్లింగ్ చేస్తున్న శబ్ధాలు, జేసీబీలతో తవ్వుతున్న శబ్ధాలు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు

సత్యసాయి జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి కేటుగాళ్లు ఏకంగా జేసీబీలతో తవ్వకాలు జరిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. నలుగురు కేటుగాళ్లను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. జిల్లాలోని అమరాపురం మండలం పేలుబండ చెరువు సమీపంలో అర్దరాత్రి గుప్త నిధుల కోసం జెసిబితో తవ్వకాలు జరిపారు దుండగులు. అర్ధరాత్రి గ్రామ శివారులో డ్రిల్లింగ్ చేస్తున్న శబ్ధాలు, జేసీబీలతో తవ్వుతున్న శబ్ధాలు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని అక్కడికి వెళ్లి చూడగా దుండగులు తవ్వకాలు జరుపుతున్నట్టు గ్రహించారు. వెంటనే విషయం పోలీసులకు చేరవేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కాంతరాజు, మంజునాథ్‌, మూర్తి, రాములును అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యంగ్ టైగర్‌కు.. బాలీవుడ్ దాసోహమయ్యే క్షణాలు వచ్చేశాయి !!

ఐడోంట్ కేర్.. అబ్బాయి మౌనంపై బాలయ్య స్ట్రాంగ్ కౌంటర్

కారులో ప్రయాణిస్తూ నదిని దాటబోయారు.. చివరికి ??

తీరం వెంబడి క్షుద్రపూజలు.. భయాందోళనలో స్థానికులు