ఇరవైల్లోనే రూ. 9 కోట్ల ఇంటిని సొంతం చేసుకుంది

Updated on: Jan 09, 2026 | 4:28 PM

సింగపూర్‌కు చెందిన 26 ఏళ్ల క్రిస్ 9 కోట్ల విలువైన సొంతింటిని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది. 8 ఏళ్ల నుంచే పొదుపు, 14 ఏళ్ల వయసు నుంచే పెట్టుబడులు పెడుతూ అద్భుత ఆర్థిక ప్రణాళికతో ఈ ఘనత సాధించింది. పట్టుదల, క్రమశిక్షణతో కూడిన ఆమె ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకం. తల్లిదండ్రుల సహకారం లేకుండానే ఆమె ఈ కల నెరవేర్చుకుంది.

సింగపూర్‌కు చెందిన అమ్మాయి 26 ఏళ్ల వయసులోనే కోట్లు విలువ చేసే ఇంటిని కొంది. తన సంతోషాన్ని పంచుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. అది నెట్టింట వైరల్‌గా మారడంతో ఆమె పేరు వార్తల్లో నిలిచింది. ఎనిమిదేళ్ల వయసు నుంచే పాకెట్‌ మనీని దాచుకోవడం మొదలుపెట్టింది క్రిస్‌ క్రాస్‌. ఓవైపు చదువుకు ప్రాధాన్యం ఇస్తూనే.. మరోవైపు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పార్ట్‌టైం ఉద్యోగిగా పనిచేయడం మొదలుపెట్టింది. పెట్టుబడుల గురించి తెలుసుకున్న ఆమె.. 14 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. తనకు 27 ఏళ్ల వయసు వచ్చేసరికి సొంతిల్లు కొనాలని అనుకుని అందుకు తగ్గట్టుగా ప్లాన్ వేసుకుంది. ఆర్థిక విషయాల గురించి చిన్నప్పట్నుంచే తెలుసుకోవడం ప్రారంభించింది. కెరీర్‌ను కూడా అందుకు తగ్గట్టుగానే నిర్మించుకుంది. క్రిస్ రోజుకు 12 నుంచి 18 గంటలు పనిచేయడమే కాకుండా.. జిమ్‌లో ఉంటూ కూడా ఆదాయ మార్గాలను వెతికేది. సౌండ్‌ రికార్డిస్ట్‌గా పనిచేస్తోన్న క్రిస్‌.. కంటెంట్‌ క్రియేటర్‌గా ఇన్‌స్టాలో పోస్టులు పెడుతుంటుంది. ఖర్చు విషయంలో క్రిస్‌ చాలా కచ్చితంగా ఉంటుందట. అలాగని తన ఇష్టాఇష్టాలను ఏమాత్రం దూరం పెట్టనని చెబుతోంది. మ్యూజిక్‌ కన్సర్ట్‌లకు హాజరు కావడానికి రోజువారీ ఖర్చులు తగ్గించుకునే క్రిస్.. క్యాష్‌బ్యాక్‌లు ఉండే యాప్స్‌ను వాడటం, తక్కువ ధరకు వస్తువులను కొనడం వంటివి చేస్తుంది. అలా ఒకవైపు తన ఆసక్తులతో పాటు, మరోవైపు సేవింగ్స్‌కి కూడా ప్రాధాన్యం ఇస్తుంది. 14 ఏళ్ల నుంచే డబ్బులు దాచుకుంటూ వచ్చిన క్రిస్‌.. ఇటీవల రెండు కోట్ల రూపాయలు డౌన్ పేమెంట్‌ చేసి సొంతింటి కలను సాకారం చేసుకుంది. తన తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సహకారం తీసుకోలేదని చెప్పింది. సొంతింటి కలను సాకారం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందనీ తన లక్ష్యాన్ని అనుకున్నట్టుగానే సాధించాననీ చెప్పుకొచ్చింది. ఇంటి విలువ సుమారు 9 కోట్ల రూపాయలు ఉంటుందనీ ఇంటి తాళాలు తీసుకునేవరకు తను ఇల్లు కొన్న విషయం తల్లిదండ్రులకు కూడా తెలియదనీ మొత్తం డౌన్‌పేమెంట్‌ను క్యాష్‌లో చెల్లించా’ అని చెబుతోంది క్రిస్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గురువారం అర్ధరాత్రి 12 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారం క్లోజ్‌

నౌక పెట్టిన అగ్గి మూడో ప్రపంచ యుద్ధం తప్పదా ??

వెనిజులా అధ్యక్షుడు, అతడి భార్యను ఎలా బంధించారంటే ?? ఏఐ వీడియో

జేఎఫ్‌-17 యుద్ధ విమానాలపై.. దోస్త్‌ మేరా దోస్త్‌

పెద్ద మొత్తంలో బంగారం.. స్విట్జర్లాండ్‌కు తరలించిన మదురో