Pakistan: ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!

|

Aug 29, 2024 | 4:51 PM

పాకిస్తాన్లో దారుణం జరిగింది. తుపాకులు చేతబట్టిన కొందరు సాయుధులు రోడ్డుపై వాహనాలను అడ్డగించి.. ప్రయాణికుల్ని కిందికి దింపేసి కాల్పులు జరిపారు. బలూచిస్థాన్‌ లోని ముసాఖెల్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారని డాన్‌ మీడియా సంస్థ తెలిపింది. ముసాఖెల్ జిల్లాలోని రరాషమ్‌లోని రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు సాయుధులు దారిని అడ్డగించి, అటుగా వస్తోన్న బస్సులు, ట్రక్కుల్లో నుంచి ప్రయాణికుల్ని దింపి ,

పాకిస్తాన్లో దారుణం జరిగింది. తుపాకులు చేతబట్టిన కొందరు సాయుధులు రోడ్డుపై వాహనాలను అడ్డగించి.. ప్రయాణికుల్ని కిందికి దింపేసి కాల్పులు జరిపారు. బలూచిస్థాన్‌ లోని ముసాఖెల్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారని డాన్‌ మీడియా సంస్థ తెలిపింది. ముసాఖెల్ జిల్లాలోని రరాషమ్‌లోని రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు సాయుధులు దారిని అడ్డగించి, అటుగా వస్తోన్న బస్సులు, ట్రక్కుల్లో నుంచి ప్రయాణికుల్ని దింపి, వారి గుర్తింపును తనిఖీ చేశారు. తర్వాత వారిపై కాల్పులు జరపడంతో 23 మంది మృతి చెందారు. అంతేగాకుండా వాహనాలకు నిప్పుపెట్టారు. పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన ప్రయాణికులే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు మీడియా తెలిపింది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on